
పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి
పినపాక: పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని, విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ అన్నారు. గురువారం మండల పరిధిలోని ఎల్సిరెడ్డిపల్లిలో ఉన్న గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. పాఠశాలలోని పరిసరాలు వంటగది, డైనింగ్ హాల్, పరిశీలించారు. మెనూ అమలుపై ఆరా తీశారు. వర్షాకాలం వస్తున్నందున పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. డైలీ వర్కర్లు సమ్మెలో పాల్గొంటున్నందుకు పాఠశాలలో చెత్త పేరుకుపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థులన నైపుణ్యాలను పరిశీలించారు. రోజూ ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి భోజనం చేయాలని ఆదేశించారు. తహసిల్దార్ గోపాలకృష్ణ, హెచ్‌ఎం వీరా కుమారి, వార్డెన్ విజయ పాల్గొన్నారు.
ఎన్నికల నిబంధనలు పాటించాలి
అశ్వాపురం: ఎన్నికల నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ అన్నారు. గురువారం ఆయన మండలంలోని తహసీల్దార్ కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయాలను తనిఖీ చేశారు. రికార్డులు, హాజరు పుస్తకాలను పరిశీలించారు. ప్రజా సేవల అమలుపై ఆరా తీశారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎంపీటీసీ, ఎడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తహసీల్దార్ మణిధర్, ఎంపీడీఓ రవీంద్ర ప్రసాద్, అధికారులు పాల్గొన్నారు.
భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ