చెక్‌డ్యాంలో మహిళ మృతదేహం లభ్యం | - | Sakshi
Sakshi News home page

చెక్‌డ్యాంలో మహిళ మృతదేహం లభ్యం

Sep 15 2025 8:07 AM | Updated on Sep 15 2025 8:07 AM

చెక్‌

చెక్‌డ్యాంలో మహిళ మృతదేహం లభ్యం

అశ్వారావుపేటరూరల్‌: వాగు దాటే క్రమంలో వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన ఇద్దరు మహి ళా కూలీల్లో ఆదివారం ఒకరి మృతదేహం లభ్య మైంది. కాగా, మరో మహిళ ఆచూకీ ఇంకా దొరకలేదు. మండలంలోని గోపన్నగూడెం – కన్నాయిగూడెం మార్గంలో ఉన్న వాగును ఏపీలోని ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం పూచికపాడు గ్రామానికి చెందిన ఏడుగురు కూలీలు దాటుతున్న క్రమంలో పాలడుగల చెన్నమ్మ (60), పచ్చితల వరలక్ష్మి(55) గల్లంతైన సంగతి తెలిసిందే. ఆదివారం తెల్లవారుజాము నుంచే పెదవాగు వెంబడి ఆచూకీ కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. అనంతారం గ్రామ సమీపంలోని వాగు చెక్‌ డ్యాం వద్ద చెన్నమ్మ మృతదేహాన్ని గుర్తించిన ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరో కూలీ వరలక్ష్మి ఆచూకీ కోసం అధికారులు, సిబ్బంది గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. సీఐ నాగరాజు, ఎస్‌ఐ యయాతిరాజుతోపాటు ఏపీలోని ఏలూరు జిల్లా పోలవరం డీఎస్పీ వెంకటేశ్వరరావు, జీలుగుమిల్లి సీఐ వెంకటేశ్వరరావు, ఎస్‌ఐ క్రాంతికుమార్‌ ఆధ్వర్యంలో గాలిస్తున్నారు.

గోదావరి తీరంలో పాము కలకలం

భద్రాచలంటౌన్‌: గోదావరి తీరంలో స్నాన ఘట్టాల వద్ద ఒక పాము కలకలం సృష్టించింది. భక్తులు ఆదివారం ఉద యం గోదావరిలో స్నానాలు ఆచరించేందుకు దిగే క్రమంలో ఒక పాము కనిపించడంతో భయభ్రాంతులకు గురయ్యా రు. స్థానికలు వచ్చి పామును దూరంగా తరిమారు. కొండ చిలువ లాగా ఉండడంతో భక్తులు ఆ ప్రదేశంలో స్నానాలు చేసేందుకు భయపడ్డారు.

వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు

ఇల్లెందు: బాధితుడి నుంచి ఫీజు తీసుకుని, హైకోర్టులో కేసు అప్పీల్‌ చేస్తానంటూ బురిడీ కొట్టించిన వ్యక్తిపై ఇల్లెందు పోలీసులకు ఫిర్యాదు అందింది. పట్టణంలోని సత్యనారాయణపురానికి చెందిన ఎస్‌కే ఫకీర్‌సాహెబ్‌, తన భార్యకు మధ్య జరిగిన గొడవలపై కొత్తగూడెం కోర్టులో కేసు దాఖలు చేశారు. కాగా, ఫకీర్‌సాహెబ్‌ తన భార్యకు ప్రతీ నెల రూ.10 వేలు భరణం చెల్లించాలని కోర్టు తీర్పు ఇచ్చింది. ప్రతీ నెలా తన భార్యకు రూ.10 వేలు భరణం చెల్లించే స్తోమత లేదని, హైకోర్టులో అప్పీల్‌ చేసుకునేందుకు నిర్ణయించుకున్నాడు. ఇల్లెందు జేకే కాలనీకి చెందిన ఓ లీడర్‌ ద్వారా ఓ న్యాయవాది పరిచయమై హైకోర్టులో అప్పీల్‌ చేస్తానని, రూ.10 వేల భరణం తగ్గించేలా చేస్తానని నమ్మబలికాడు. కేసు వాదించేందుకు రూ.35 వేలు ఫీజు తీసుకున్నాడు. నెలలు గడుస్తున్నా ఈ కేసు హైకోర్టులో అప్పీల్‌ చేయకపోవటం, కొత్తగూడెం కోర్టు నుంచి భరణం చెల్లింపు నోటీసులు వస్తుండటంతో అనుమానం వచ్చిన ఫకీర్‌సాహెబ్‌ హైకోర్టు బార్‌ కౌన్సిల్‌ను సంప్రదించాడు. సదరు వ్యక్తి న్యాయవాది కాదని, హైకోర్టు బార్‌ కౌన్సిల్‌లో తన పేరు లేదని బార్‌ కౌన్సిల్‌ నుంచి లిఖితపూర్వకంగా లేఖ ఇచ్చారు. ఈ విషయమై ఫకీర్‌సాహెబ్‌ ఇల్లెందు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సీఐ టి.సురేశ్‌ను వివరణ కోరగా ఫకీర్‌సాహెబ్‌ నుంచి ఫిర్యాదు అందిందని, విచారణ చేస్తున్నామని తెలిపారు. పోలీసుల సూచన మేరకు ఇల్లెందు బార్‌ అసోసియేషన్‌లో కూడా బాధితుడు ఫిర్యాదు చేశాడు.

పేకాటస్థావరంపై దాడి

ఖమ్మంక్రైం: పేకాట స్థావరంపై ఖమ్మం టూటౌన్‌ పోలీసులు ఆదివారం రాత్రి దాడి చేశారు. బైపాస్‌రోడ్డులోని నూతన బస్టాండ్‌ సమీపంలో ఓ ఇంట్లో పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచరం మేరకు టూటౌన్‌, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడి చేశారు. గుంటూరు చెందిన వ్యక్తితో పాటు ఖమ్మానికి ఆరుగురు పోలీసులకు చిక్కారు. వారి వద్ద నుంచి రూ.45 వేలు స్వాధీనం చేసుకుని, వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ముగ్గురిపై కేసు

రఘునాథపాలెం: వ్యవసాయ భూమికి ఫెన్సింగ్‌ వేస్తుండగా అడ్డుకున్న ముగ్గురిపై ఆదివారం పోలీసులు కేసు నమోదు చేశారు. మండలంలోని చింతగుర్తికిచెందిన రైతు భరత్‌ తన భూమికి ఫెన్సింగ్‌ వేస్తుండగా, అదే గ్రామానికి చెందిన అశోక్‌, అనిలా, వెంకటేశ్వర్లు అడ్డుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ ఉస్మాన్‌షరీఫ్‌ తెలిపారు.

చెక్‌డ్యాంలో మహిళ మృతదేహం లభ్యం1
1/2

చెక్‌డ్యాంలో మహిళ మృతదేహం లభ్యం

చెక్‌డ్యాంలో మహిళ మృతదేహం లభ్యం2
2/2

చెక్‌డ్యాంలో మహిళ మృతదేహం లభ్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement