
కిన్నెరసానిలో జలవిహారం
పాల్వంచరూరల్: కిన్నెరసానిలో ఆదివారం పర్యాటకులు సందడి చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు తరలివచ్చారు. డ్యామ్, జలాశయం, డీర్ పార్కులను వీక్షించారు. ప్రకృతి అందాల నడుమ సరదాగా గడిపారు. 526 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా వైల్డ్‌లైఫ్ శాఖకు రూ.28,780 ఆదాయం లభించింది. 230 మంది బోటు షికారు చేయగా టూరిజం కార్పొరేషన్‌కు రూ.13,900 ఆదాయం లభించినట్లు నిర్వావహకులు తెలిపారు.
కిన్నెరసాని ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తివేత
పాల్వంచరూరల్: ఎగువ ప్రాంతాల నుంచి కిన్నెరసాని జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. ఎగువ నుంచి 1700 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్ట్‌లోకి చేరుతుండగా, రెండు గేట్లు ఎత్తిఉంచి 8 వేల క్యూసెక్కుల నీటిని దిగువన గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. రిజర్వాయర్ పూరిస్థాయి నీటిమట్టం 407 అడుగులు కాగా, ఆదివారం 405.50 అడుగులుగా నమోదైంది.