
ఓసీల్లోని నీటిని ఎత్తిపోయాలి
మణుగూరు టౌన్: వర్షాల వల్ల ఉపరితల గనుల్లోకి చేరే నీటిని వీలైనంత త్వరగా బయటకు ఎత్తిపోయాలని, బొగ్గు ఉత్పత్తికి ఆటంకాలను నివారించాలని డైరెక్టర్ (ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్) కొప్పుల వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం మణుగూరు ఏరియాలో పర్యటించిన ఆయన ఓఎన్‌జీసీ డైరెక్టర్ ఆఫ్ జనరల్ సునీల్‌కుమార్, జనరల్ మేనేజర్ ఎస్‌ఎస్ మాయల్ కిరణ్‌లతో కలిసి పగిడేరు జియోథర్మల్ విద్యుత్ ప్లాంట్‌ను సందర్శించారు. 20 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు అవకాశాలు పరిశీలించాలని సంబంధిత అధికారులకు సూచించారు. అనంతరం వ్యూ పాయింట్ నుంచి పీకేఓసీ–2లో వరద నీరు చేరిన ప్రదేశాన్ని మ్యాప్ ద్వారా పరిశీలించారు. నిలిచిన నీటిని బయటకు పంపే విధంగా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. జీఎంలు దుర్గం రాంచందర్, కనకయ్య, శ్రీనివాస్, ఇతర అధికారులు పంకజ్, రాజ్‌కుమార్, శ్రీనివాస్, శ్రీనివాస్, వీరభద్రరావు, శ్రీనివాసచారి, కనకయ్య, బీఎస్ రావు, వీరభద్రుడు, సురేశ్, శ్రీనివాస్, దయాకర్, బబుల్ రాజు తదితరులు పాల్గొన్నారు.
సింగరేణి డైరెక్టర్ కొప్పుల వెంకటేశ్వర్లు