
13 కిలోల ఎండుగంజాయి స్వాధీనం
భద్రాచలంటౌన్: భద్రాచలం మీదుగా ఒడిశా రాష్ట్రం మల్కాన్‌గిరి నుంచి హైదరాబాద్, మహా రాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న నిషేధిత ఎండు గంజాయిని ఎకై ్సజ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం ఆది వారం స్వాధీనం చేసుకున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్‌ఐ సీహెచ్.శ్రీహరి తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాచలం పట్టణం కూనవరం రోడ్డులో రూట్‌వాచ్‌తో పాటు వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో ఒక కారు, ద్విచక్ర వాహనం అనుమానాస్పదంగా కనిపించడంతో ఆపి తనిఖీ చేయగా బ్యాగులో 13.130 కిలోల ఎండు గంజాయి లభించింది. వాహనాలలో ఉన్న వారిని అదుపులోకి తీసుకుని విచారించగా.. ఒడిశా రాష్ట్రం మల్కన్‌గిరిని చెందిన సయ్యద్ యూనిస్ మాలిక్, బోధ పవన్‌లు తేలింది. ఇందులో మరో వ్యక్తి కోన ఉమామహేశ్వరరావు పరారీలో ఉండగా.. ఇద్దరిని అరెస్ట్ చేసి భద్రాచలం ఎకై ్సజ్ స్టేషన్‌లో అప్పగించారు. పట్టుబడిన గంజాయి, హోండా సీటీ కారు, ద్విచక్రవాహనాన్ని సీజ్ చేశారు. గంజాయి విలువ సుమారు రూ.12 లక్షల వరకు ఉంటుందని ఎస్‌ఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ కరీం, కానిస్టేబుళ్లు సుధీర్, వెంకట్, హరీష్, వీరబాబు, ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు.
రామవరంలో 300 గ్రాముల గంజాయి..
కొత్తగూడెంటౌన్: గంజాయి సేవిస్తున్న ఇద్దరు వ్యక్తులను రామవరం టూటౌన్ పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుంచి 300 గ్రాముల గంజాయిని స్వా ధీనం చేసుకున్నారు. టూటౌన్ సీఐ ప్రతాప్ కథనం ప్రకారం.. రామవరం నాగయ్యగడ్డ బస్తీ శివారు గరీబ్‌పేటకు వెళ్లే దారిలో ఎస్సై బి.కిశోర్ బృందం పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సమీపంలో ఉన్న చెట్ల మధ్య నాగయ్యబస్తీకి చెందిన ముగ్గురు యువకులు కాండ్రేగుల నాగ అఖిల్ అలియాస్ మెంటూ, గరీబ్‌పేటకు చెందిన పర్లపల్లి ఉదయ్‌కుమార్ అలియాస్ భూపతి, ఉదయ్‌లు అనుమానాస్పదంగా కనిపించగా.. వారిని విచారించడంతో పొంతన లేని సమాధానాలు చెప్పారు. దీంతో ఆ ముగ్గురి దగ్గర ఉన్న ప్లాస్టిక్ బ్యాగ్‌లను తీసుకునేందుకు ప్రయత్నించగా.. ఒక వ్యక్తి పరారు కాగా నాగఅఖిల్, ఉదయ్‌లను పట్టుబడ్డారు. వారిద్దరి వద్ద నుంచి రూ.15వేలు విలువైన 300 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని పోలీసుస్టేషన్‌కు తరలించినట్లు తెలిపారు. వారిపై కేసు నమోదు చేసి, మూడవ వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు సీఐ ప్రతాప్ తెలిపారు. ఈ తనిఖీల్లో హెడ్ కానిస్టేబుళ్లు బలరాం రాజు, కానిస్టేబుళ్లు వెంకటేశ్వర్లు, రాజా, బుచ్చిరాములు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.