
కిన్నెరసానిలో పర్యాటకుల సందడి
పాల్వంచరూరల్: కిన్నెరసానిలో ఆదివారం పర్యాటకులు సందడి చేశారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి పర్యాటకులు భారీగా తరలివచ్చారు. కిన్నెరసాని ప్రాజెక్ట్, డ్యామ్, జలాశయం, డీర్ పార్కులోని దుప్పులను వీక్షించారు. ప్రకృతి అందాల నడుమ ఆహ్లాదం పొందారు. 489 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా వైల్డ్‌లైఫ్ శాఖకు రూ.25,770 ఆదాయం లభించగా, 320 మంది బోటు షికారు చేయడం ద్వారా టూరిజం కార్పొరేషన్ సంస్థకు రూ.15,010 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఒక్కరోజు ఆదాయం రూ.56,170