
నీడ కోసం కాదు.. మొక్కల కోసమే.!
జాతీయ రహదారిపై
బారులుదీరిన వాహనాలు
జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న పచ్చని చెట్ల నీడలో బారులుదీరిన ఈ వాహనాలు నీడ కోసం అనుకుంటే పొరపాటే. అశ్వారావుపేటలోని పామాయిల్ ఫ్యాక్టరీ దగ్గర్లో రహదారికి పక్కనే ఆయిల్ ఫెడ్‌కు చెందిన పామాయిల్ మొక్కల నర్సరీ ఉంది. ప్రస్తుతం వానాకాలం సీజన్ నేపథ్యంలో ఆయిల్‌పాం తోటల సాగుకు అనుకూల వాతావరణం కావడంతో రైతులు పామాయిల్ మొక్కల కోసం నర్సరీ వద్దకు వస్తున్నారు. అక్కడ మొక్కలు తరలించేందుకు వాహనాలు అధిక సంఖ్యలో రాగా, వాటిలో కొన్ని వాహనాలు మంగళవారం తమవంతు కోసం రహదారిపై ఇలా బారులుదీరాయి. – అశ్వారావుపేటరూరల్