
దాడి కేసులో ఇద్దరు అరెస్ట్
టేకులపల్లి: కత్తితో దాడి చేసిన కేసులో పోలీసులు ఇద్దరు నింది తులను గురువారం అరెస్ట్ చేశా రు. టేకులపల్లి ఎస్‌ఐ అలకుంట రాజేందర్ కథనం ప్రకారం.. మండలంలోని మూడు తండాకు చెందిన గుగులోత్ రవి ఈనెల 7న రాత్రి టేకులపల్లి లోని డాల్ఫి న్ బేకరీ వద్దకు వెళ్లాడు. అదే సమయంలో రవి తమ్ముడు (బాబాయి కుమారుడు) గుగులోత్ వినోద్ కుమార్ కూడా అక్కడికి వచ్చాడు. కొంత కాలంగా ఇద్దరి మధ్య డబ్బుల విషయంలో వివాదం ఉండగా, మళ్లీ వాగ్వాదం నెలకొంది. దీంతో వినోద్ కుమార్ కత్తితో దాడి చేయడంతో రవికి తీవ్రగాయాలయ్యాయి. అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితుడిని స్థానికులు కొత్తగూడెంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు వినోద్‌కుమార్, అతనికి సహకరించిన వాంకుడోత్ ప్రవీణ్‌ను అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి రిమాండ్ విధించారని ఎస్‌ఐ తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడికి గాయాలు
కరకగూడెం: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడికి తీవ్ర గాయాలైన సంఘటన గురువారం జరిగింది. మండల పరిధిలోని నీలాద్రిపేట వలస ఆదివాసీ గ్రామానికి చెందిన కుంజం శివ బైక్‌పై కరకగూడెం వచ్చి వెళ్తుండగా మోతె మూలమలుపు వద్ద చెట్టును ఢీకొట్టాడు. దీంతో తీవ్రగాయాలు కావడంతో 108లో కరకగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం మణుగూరు ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు.
రెండు బైక్‌లు ఢీ : ఇద్దరికి గాయాలు
ఇల్లెందురూరల్: మండలంలోని కొమరారం గ్రామ శివారులో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇల్లెందు కోర్టు ఉద్యోగి స్వామినాథం ఆళ్లపల్లి మండలానికి బైక్‌పై వెళ్లి వస్తున్నాడు. అదే సమయంలో ఇల్లెందుకు చెందిన మహేష్ మరో బైక్‌పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో కొమరారం శివారులో రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో ఇద్దరికి గాయాలు కాగా, చికిత్స నిమిత్తం ఖమ్మం ఆస్పత్రికి తరలించారు.