
మహిళా సంఘాల పనితీరు భేష్
కొత్తగూడెంఅర్బన్: స్వయం సహాయక మహిళా సంఘాల పనితీరు భేష్ అని ట్రైనీ కలెక్టర్ సౌరభ్ శర్మ అన్నారు. గురువారం కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని వివిధ డివిజన్లలో డ్వాక్రా గ్రూపు మహిళలతో ఆయన మాట్లాడారు. గ్రూపుల నిర్మాణం, పనితీరు, ఆర్థికాభివృద్ధి తదితర విషయాలు అడిగి తెలుసుకున్నారు. పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రుణాలు పొందినవారు తిరిగి చెల్లిస్తున్న తీరు ఆదర్శంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మెప్మా డీఎంసీ సీహెచ్. రాజశేఖర్, ఏడిఎంసీ టి.చంద్రశేఖర్‌బాబు, టీఎంసీబి వెంకటేశ్వర్లు, సీఓపీ సరిత, అంగన్వాడీ టీచర్లు శాంతి, సుజాత, అరుణ, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.