
జెడ్పీని సందర్శించిన ట్రైనీ కలెక్టర్
చుంచుపల్లి: జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయాన్ని ట్రైనీ కలెక్టర్ సౌరభ్ శర్మ గురువారం సందర్శించారు. అసిస్టెంట్ కలెక్టర్ హోదాలో వివిధ శాఖల్లో ఆరు రోజుల శిక్షణ నిమిత్తం ఆయన జిల్లా పరిషత్ పరిధిలోని వివిధ విభాగాల పని తీరు, ఇతరఅంశాలకు సంబంధించిన వివరా లను జిల్లా ప్రజా పరిషత్ సీఈవో బి. నాగలక్ష్మి, డిప్యూటీ సీఈఓ కె.చంద్రశేఖర్‌లను అడిగి తెలుసుకున్నారు. వివిధ విభాగాల ఫైళ్లను పరి శీలించారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో రికార్డుల నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ సిబ్బందిని అభినందించారు.
కాలువ కట్టకు మరమ్మతులు
ములకలపల్లి: కోతకు గురవుతున్న సీతారామ ఎత్తిపోతల పథకం (ఎస్‌ఆర్‌ఎల్‌ఐపీ) ప్రధాన కాలువ కట్టకు అధికారులు మరమ్మతులు చేపట్టారు. మండల పరిధిలోని వీకే రామవరం శివారు పంప్‌హౌస్–2 నుంచి కమలాపురంలోని పంప్‌హౌస్–3కు వెళ్లే ప్రధాన కాలువ 51వ కిలోమీటర్ వద్ద కుడివైపున కోతకు గురైంది. వర్షాకాలం నేపథ్యంలో ప్రధాన కాలువ కట్ట తెగిపోయి సిమెంట్ లైనింగ్‌కు పగిలిపోయే ప్రమాదముంది. దీంతో ఇరిగేషన్ శాఖ అధి కారులు స్పందించి కోతకు గురైన ప్రదేశంలో మట్టిపోసి కట్టను పటిష్టం చేశారు.
బీఎస్‌ఎన్‌ఎల్
న్యాయవాదిగా బాబూరావు
కొత్తగూడెంఅర్బన్: బీఎస్‌ఎన్‌ఎల్ ఎంప్యానెల్మెంట్ న్యాయవాదిగా ఏవూరి బాబూరావు నియమితులయ్యారు. ఉమ్మడి జిల్లాలో న్యాయ సేవల కోసం బీఎస్‌ఎన్‌ఎల్ చీఫ్ జనర ల్ మేనేజర్ ఈ మేరకు నియామకం చేపట్టారు. బాబూరావుకు గురువారం జిల్లా అసిస్టెంట్ జనరల్ మేనేజర్ సుభాష్ నియామక పత్రాన్ని అందజేశారు. బీఎస్‌ఎన్‌ఎల్ సబ్ డివిజనల్ ఇంజనీర్ సక్రు, జూనియర్ టెలికాం ఆఫీసర్ సందీప్, రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు శివరాంజి పాల్గొన్నారు.
రేపు ద్రాక్షారామంలో రామయ్య కల్యాణం
భద్రాచలం: ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా ద్రాక్షారామంలో ఈ నెల 19న భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణం నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ రమాదేవి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అక్కడి బాల భక్తసమాజం అభ్యర్థనతో దేవస్థానం ప్రచార రథా న్ని పంపి, ప్రసన్నాంజనేయస్వామి దేవస్థానంలో వేడుక జరుపనున్నట్లు పేర్కొన్నారు.
వెలిసిన మావోయిస్టు వ్యతిరేక పోస్టర్లు
సుజాతనగర్: మండల పరిధిలోని స్టేషన్ బేతంపూడిలో గురువారం మావోయిస్టు వ్యతి రేక పోస్టర్లు వెలిశాయి. మావోయిస్టు ఆత్మ పరి రక్షణ ప్రజాఫంట్ పేరుతో వాల్ పోస్టర్లను గ్రా మంలో అక్కడక్కడా అంటించారు. మావో యిస్టులు ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలోకి రావాలని పోస్టర్లలో పేర్కొన్నారు.
ఇసుక నిల్వలు సీజ్
ములకలపల్లి: మండలంలోని వీకే. రామవరం, ఒడ్డు రామవరం, సంజీవ్‌పల్లి శివార్లలో అక్రమంగా నిల్వ చేసిన నాలుగు లారీల ఇసుకను గురువారం రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. ఇసుకను స్వాధీనం చేసుకుని తహసీల్‌కు తరలించినట్లు తహసీల్దార్ భూక్యా గన్యా తెలిపారు.
మందుపాతరలు నిర్వీర్యం
చర్ల: సరిహద్దు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు బీరు బాటిళ్లలో ఏర్పా టు చేసిన రెండు మందుపాతరలను భద్రతా బలగాలు గురువారం గుర్తించి నిర్వీర్యంచేశారు. ఊ సూరు పోలీస్‌స్టేషన్ పరిధి టేకుమెట్ల అటవీ ప్రాంతానికి వెళ్తున్న సీఆర్‌పీఎఫ్ 196 బెటాలియన్‌కు చెందిన బలగాలు మందుపాతరలను గుర్తించారు. ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి, అక్కడే నిర్వీర్యం చేశారు.

జెడ్పీని సందర్శించిన ట్రైనీ కలెక్టర్

జెడ్పీని సందర్శించిన ట్రైనీ కలెక్టర్