
విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం
మణుగూరురూరల్: విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో రేకుల ఇల్లు దగ్ధమైన ఘటన మండలంలోని సాంబా యిగూడెంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన షేక్ ఖుర్బాన్ నిద్రిస్తున్న సమ యంలో గురు వారం రాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇంట్లో ఉన్న గృహోపకరణాలు, వస్తువులన్నీకాలిపోయాయి. ఖుర్భాన్‌కు సైతం స్వల్ప గాయాలయ్యాయి. సమాచారంఅందుకున్న మ ణుగూరు తహసీల్దార్ అద్దంకి నరేశ్ దగ్ధమైన ఇంటిని పరిశీలించారు. డీటీరామారావు, ఆర్‌ఐ గోపి ఉన్నారు.
నలుగురిపై కేసు నమోదు
దుమ్ముగూడెం: అక్రమంగా పాపను దత్తత తీసుకున్న విషయంలో ఐసీడీఎస్ అధికారుల ఫిర్యాదు మేరకు నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ గణేశ్ శుక్రవారం తెలిపారు. మండలంలోని చిన్న ఆర్లగూడెం గ్రామానికి చెందిన కోర్స రమేశ్ – ఆదిలక్ష్మి దంపతులు అశ్వాపురం మండలం కుర్నపల్లి గ్రామానికి చెందిన మెస్సా నరసింహారావు – అమల దంపతుల కుమార్తెను రెండు నెలల కిందట అక్రమంగా దత్తత తీసుకున్నారు. విషయం తెలుసుకున్న జిల్లా బాలల సంరక్షణ విభాగం అధికారులు పాపను తల్లిదండ్రులను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఎదుట హాజరు పరచారు. వారు తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. పాపను ఎవరికీ ఇవ్వమని, తామే పెంచుకుంటామని కమిటీ వారికి తల్లిదండ్రులు తెలిపగా పాపను అప్పగించారు. కానీ, నెల రోజుల నుంచి పాపను కోర్స రమేశ్ – ఆదిలక్ష్మి దంపతులు పెంచుకుంటున్నారు. విషయం తెలుసుకున్న ఐసీడీఎస్ అధికారులు పాపను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆర్లగూడెం సెక్టార్ సూపర్‌వైజర్ పాయం రాజేశ్వరి ఫిర్యాదు మేరకు అక్రమ దత్తతకు పాల్పడిన నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. కాగా, ఆరు నెలల ఆ పాపను భద్రాచలంలోని శిశుగృహకు తరలించారు.
చికిత్స పొందుతున్న
లారీడ్రైవర్ మృతి
పాల్వంచరూరల్: లారీ కిందకు వెళ్లి మరమ్మతులు చేస్తున్న డ్రైవర్ పైనుంచి అదే లారీ వెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఏపీలోని సత్యసాయి జిల్లా సూరపల్లి గ్రామానికి చెందిన గార్ల సుందర్‌రాజు (35) సారపాక ఐటీసీ నుంచి పేపర్‌లోడుతో బెంగళూరుకు వెళ్తున్నా డు. గురువారం రాత్రి పాల్వంచ మండలం ఆర్‌టీఏ చెక్‌పోస్టు సమీపంలో నాగారంకాలనీవద్ద చాకలి శివశంకర్ లారీ చెడి పోయింది. సుందర్‌రాజు లారీని ఆపి విశ్రాంతి తీసుకుంటున్నాడు. అదే సమయంలో చాకలి శివశంకర్, క్లీనర్ ఇస్లాయిల్ కలిసి సుందర్‌రాజును సాయం కోరడంతో లారీ కిందకు వెళ్లి మరమ్మతులు చేస్తున్నాడు. లారీ హ్యాండ్ బ్రేక్ వేయకపోవడంతో ప్రమాదవశాత్తు లారీ ముందుకు కదిలి, మరమ్మతులు చేస్తున్న సుందర్‌రాజు పైనుంచి వెళ్లింది. తీవ్రంగా గాయపడిన ఆయన్ను కొత్తగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. మృతుని సోదరుడు సురేశ్‌బాబు ఫిర్యాదు మేరకు లారీడ్రైవర్, క్లీనర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సురేశ్ తెలిపారు.