
ప్రచార కరపత్రాల దహనం
ఇల్లెందురూరల్: మండలంలోని 21 పిట్ ఏరి యా భూపేశ్‌నగర్‌లో కరపత్రాలు, ఓ మతగ్రంథంతో ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్, భజరంగ్‌దళ్ కార్యకర్తలు వారిని అడ్డుకున్నారు. వారి చేతిలో ఉన్న ప్రతులు, కరపత్రాలను లాక్కొని దహనం చేశారు. ఘటనపై దినకర్ శుక్రవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ శ్రీనివాసరెడ్డి.. ఘటనకు సంబంధించిన వీడియో ఆధారంగా ప్రతులను దహనం చేసిన పది మందిపై కేసు నమోదు చేశారు.
పురుగుమందుల షాప్‌లో
రికార్డులు స్వాధీనం
దుమ్ముగూడెం: మండలంలోని చిన్ననల్లబల్లి గ్రామానికి చెందిన పురుగుమందుల వ్యాపారి దోసపా టివెంకటేశ్వరరావు కు చెందిన దుకాణ రికార్డులను వ్యవసాయాధికారి నవీన్‌కుమార్ శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. గురువారం సుజ్ఞానపురం గ్రామానికి చెందిన ఇద్దరు రైతులకు ఒకే మందును వేర్వేరు ధరలకు విక్రయించి, బిల్లులు ఇవ్వలేదు. దీంతో రైతులు పోలీసులు, ఏఓకు ఫిర్యాదు చేశారు. ఏఓ శుక్రవారం ఎస్‌ఐ గణేశ్‌తో కలిసి దుకాణాన్ని సందర్శించి రికార్డులు పరిశీలించి బాధితులను విచారించారు. రైతులకు బిల్లులు ఇవ్వలేదని, ఇద్దరికీ వేర్వేరు ధరలకు విక్రయించినట్లు తేలడంతో రికార్డులో స్టాప్ సేల్ అని రాశారు. అనంతరం దుకాణ లైసెన్స్ రద్దు చేసేందుకు జిల్లా అధికారులకు సిఫార్సు చేసినట్లు ఏఓ తెలిపారు.
కేటీఆర్ పర్యటనలో సీఐ!
ఖమ్మంక్రైం: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటన కోసం హెలీకాప్టర్‌లో రాగా, హెలీప్యాడ్ వద్ద ఓ సీఐ కనిపించడం చర్చనీయాంశంగా మారింది. వివాదాస్పదుడిగా ముద్ర పడిన ఆ సీఐ భద్రాద్రి జిల్లా డీసీఆర్‌బీలో విధులు నిర్వర్తిస్తున్నాడు. బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి సివిల్ డ్రస్‌లో హెలీప్యాడ్ వద్ద వేచి ఉండడాన్ని గుర్తించారు. గతంలో ఖమ్మం రూరల్ సీఐగా విధులు నిర్వర్తించినప్పుడు ఆయన బీఆర్‌ఎస్ నాయకుల సూచనలతో ఇతర పార్టీల నేతలను వేధించాడనే విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ విషయమై సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా కూనంనేని సాంబశివరావు గతంలో ఘాటుగా స్పందించారు. ఇప్పుడు ఆయన కేటీఆర్ పర్యటనలో పాల్గొనడం పోలీసు వర్గాల్లో చర్చకు దారి తీసింది. ఉన్నతాధికారుల అనుమతితో వచ్చాడా, లేదా అన్నది తెలియరాలేదు. అయితే, గతంలో సిరిసిల్లలో పనిచేసినప్పుడు కేటీఆర్‌తో ఉన్న సంబంధాల కారణంగానే వచ్చి ఉంటాడని మరికొందరు చెబుతున్నారు.
ట్రెయినీ కలెక్టర్
ఆకస్మిక తనిఖీ
ఇల్లెందురూరల్: మండలంలోని బొజ్జాయిగూడెం ఆశ్రమ పాఠశాల, సుదిమళ్ల గిరిజన గురుకుల బాలికల పాఠశాలను ట్రెయినీ కలెక్టర్ సౌరభ్‌శర్మ, ఎన్‌సీడీ ప్రోగ్రాం అధికారి మధువరుణ్ శుక్రవారం సాయంత్రం తనిఖీ చేశారు. ఆశ్రమ, గురుకుల పాఠశాలల్లో వసతి గృహాలను, తరగతి గదులను, వంట, స్టోర్ రూంలను పరిశీలించారు. ప్రతీరోజు అందిస్తున్న మెనూ వివరాలతోపాటు భోజనం ఎలా ఉంటోందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మెరుగైన బోధన అందించాలని, ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేయాలని సూచించారు. అందుకోసం విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే సరైన ప్రణాళికతో ముందుకు సాగాలని పేర్కొన్నారు. రొంపేడు పీహెచ్‌సీ వైద్యాధికారి కవిత, హెచ్‌ఓ రాజు, హెచ్‌ఎం నాగమణి, మాధవి తదితరులు పాల్గొన్నారు.
21న ఖమ్మం
మార్కెట్‌కు సెలవు
ఖమ్మంవ్యవసాయం: ఆషాఢమాసం బోనాల పండుగ సందర్భంగా సోమవారం(21న) ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు ప్రకటించినట్లు ఉన్నత శ్రేణి కార్యదర్శి పి.ప్రవీణ్‌కుమార్ తెలిపారు. ఈ విషయాన్ని రైతులు గమనించాలని కోరారు. తిరిగి మంగళవారం యధాతథంగా పంటల కొనుగోళ్లు జరుగుతాయని పేర్కొన్నారు.

ప్రచార కరపత్రాల దహనం

ప్రచార కరపత్రాల దహనం