
మృతదేహానికి రీ పోస్టుమార్టం
చుంచుపల్లి: ఆంధ్రప్రదేశ్ తిరువూరులో మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తూ గతేడాది అక్టోబర్‌లో మృతి చెందిన డాక్టర్ ప్రిష్కల్లా కుమారి (62) మృతదేహానికి గురువారం వెంకటేశ్వరకాలనీలోని క్రిస్టియన్ శ్మశానవాటికలో అధికారులు, పోలీసుల సమక్షంలో తిరిగి పోస్టుమార్టం నిర్వహించారు. ప్రిష్క ల్లా కుమారి మృతిపై కుటుంబసభ్యులు అనుమా నం వ్యక్తం చేయడంతో తిరువూరు పోలీసులు, చుంచుపల్లి పోలీసులు, మెడికల్ కాలేజీ ఫోరెన్సిక్ బృందం పర్యవేక్షణలో రీ పోస్టుమార్టం నిర్వహించినట్లు చుంచుపల్లి తహసీల్దార్ కృష్ణ తెలిపారు.
కలెక్టరేట్ ఎదుట నిరసన నిద్ర
సూపర్‌బజార్(కొత్తగూడెం): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో గురువారం రాత్రి భారీ వర్షంలో నిరసన నిద్ర చేపట్టారు. నిరసన కార్యక్రమం తొలుత ధర్నాచౌక్‌లో నిర్వహించా లని భావించారు. అక్కడ చెట్లపొదలు, చెత్తా చెదా రంతో నిండి, విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో కలెక్టరేట్ మెయిన్‌గేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. వర్షంలో కూడా నిరసన కార్యక్రమం కొనసాగించారు. పోలీసులు చొరవ తీసుకుని నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష్యకార్యదర్శులు హరీష్, ఫహీం దాదా, నాయకులు వి సతీష్, ఖయ్యూం, ఉపేందర్ పాల్గొన్నారు.

మృతదేహానికి రీ పోస్టుమార్టం