
విద్యార్థులు క్రీడా పోటీల్లో రాణించాలి
కొత్తగూడెంఅర్బన్/కొత్తగూడెంటౌన్: విద్యార్థులు విద్యతో పాటు క్రీడా పోటీల్లో కూడా రాణించాలని జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ చీఫ్ ప్యాట్రన్, జైభీమ్ రావ్ భారత్ పార్టీ (జేబీపీ) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ అన్నారు. ఆదివారం పట్టణంలోని ప్రగతి మైదానంలో సబ్ జూనియర్స్ బాలురు, బాలికల బాక్సింగ్ పోటీలు నిర్వహించగా, ఆయన విజేతలకు పతకాలు, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా కామేష్ మాట్లాడుతూ ప్రతిభ చూపిన బాలబాలికలను జిల్లా జట్టుకు ఎంపిక చేశామని తెలిపారు. వీరిని ఈ నెల 25, 26, 27వ తేదీల్లో నిర్వహించే రాష్ట్రస్థాయి సబ్ జూనియర్స్ పోటీలకు పంపిస్తామని పేర్కొన్నారు. బాలుర విభాగంలో ఆర్.గణేష్, ఆర్.ఉదయ్, ఎస్.కె.అసిమ్ ఆలీ, జెస్విత్, వి.సాయి కిరణ్, కె.అరుణ్‌కృష్ణ, డి.హేమంత్, కె.మధు, కె.సోహిత్ చంద్ర, బాలికల విభాగంలో ఏ.ప్రవళిక, ఎం.హనిత్య శ్రీ, లోక్షిత, కె.శరణ్య, డి.సుప్రియ, కె.అమృత వర్షిణి, బి.కీర్తన ఎంపికయ్యారని వివరించారు. ఈ కార్యక్రమంలో బాక్సింగ్ అసోసియేషన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మాలోత్ రాజా, జిల్లా ఉపాధ్యక్షుడు ఎండీ షమీ ఉద్దీన్, జిల్లా ప్రధాన కార్యదర్శి వై.శివసుబ్రమణ్యం, కోచ్ జి.ఈశ్వర్, సహాయ కోచ్ బానోతు సాగర్ తదితరులు పాల్గొన్నారు.