
తపాలా నూతన సాంకేతికతపై అవగాహన
ఖమ్మంగాంధీచౌక్: దేశ వ్యాప్తంగా తపాలా శాఖలో ఈ నెల 22 నుంచి అమలు చేస్తున్న ఐటీ–2.0 నూతన సాంకేతిక విధానంపై ఖమ్మం డివిజన్ తపాలా పరిధిలోని ఉద్యోగులకు ఆదివారం స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఖమ్మం డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ వి.వీరభద్రస్వామి మాట్లాడుతూ.. నూతన సాంకేతిక విధానంలో తపాలా సేవలు సురక్షితంగా, వేగవంతంగా సాగనున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో శిక్షకులుగా బి.హుస్సేన్, పి.శ్రీకాంత్, పుల్లారావులు వ్యవహరించారు.