
చెరువులు వెలవెల
పాల్వంచరూరల్: గత నెలలో, ఈ నెల మొదటి వారంలో కురిసిన వర్షాలకు జిల్లాలోని జలాశయాలు నిండుకుండలా మారాయి. చెరువుల్లో మాత్రం వెలవెలబోతున్నాయి. జిల్లాలో మొత్తం 2,364 చెరువులు ఉండగా, ఒక్క చెరువు కూడా పూర్తిగా నిండలేదు. దీంతో ఆయకట్టు రైతులు సాగునీటి కోసం ఆందోళన చెందుతున్నారు.
నిండిన ప్రాజెక్ట్‌లు
జిల్లాలో మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టులు తాలిపేరు, కిన్నెరసాని, పెద్దవాగు, మూకమామిడి ఉన్నాయి. తాలిపేరు పూర్తిస్థాయి నీటిమట్టం 74.00 మీటర్లు కాగా ఆయకట్టు 24,700 ఎకరాలు ఉంది. ఇటీవల కురిసిన వర్షాలకు వరదనీరు వచ్చి చేరడంతో ప్రాజెక్ట్ పూర్తిగా నిండింది. కిన్నెరసాని ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 407 అడుగులుకాగా, ప్రస్తుతం నీటిమట్టం 399 అడుగులకు చేరింది. ఆయకట్టు 10 వేల ఎకరాలు ఉంది. అశ్వారాపుపేట మండలంలోని పెద్దవాగు ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 21 అడుగులుకాగా, సుమారు 16 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇందులో 2,360 తెలంగాణలో ఉండగా, మిగతా ఆయకట్టు ఆంధ్రాలో ఉంది. కాగా గతేడాది గండిపడటంతో ప్రాజెక్ట్‌లో నీరు నిలవడంలేదు. తాత్కాలికంగా రింగ్‌బండ్ నిర్మించినా కొద్దిమేర మాత్రమే జలాలు ఉన్నాయి. ములకలపల్లి మండలంలోని మూకమామిడి ప్రాజెక్ట్ నీటి నిల్వ సామర్థ్యం 120 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 118 అడుగులకు చేరింది. ఆయకట్టు 3,250 ఎకరాలు సాగవుతోంది. ప్రస్తుతం ప్రాజెక్ట్‌లోకి మరో రెండు ఫీట్లు చేరితే గరిష్టస్థాయికి నీటిమట్టం చేరుతుంది
ఈఏడాది వర్షాలు తక్కువే..
గతేడాదికంటే ఈ సంవత్సరాలు వర్షాలు తక్కువగా కురిశాయి. దీంతో జిల్లాలోని చెరువుల్లోకి నీళ్లు చేరలేదు. జలాశయాలు మాత్రం నిండి కళకళలాడుతున్నాయి. కిన్నెరసానిలోకి ఇన్ ఫ్లో పెరుగగా, కొద్దిమేర జలాలను దిగువకు వదిలాం. చెరువుల్లోకి మాత్రం పూర్తిస్థాయి నీళ్లు చేరలేదు. ఈ నెలాఖరులోగా భారీ వర్షాలు కురిస్తే చెరువులు నిండే అవకాశం ఉంది.
–శ్రీనివాసరెడ్డి, జిల్లా సీఈ జలవనరులశాఖ
ఇప్పటివరకు అలుగుపోసింది ఒకే ఒక్కటి
ఆందోళన చెందుతున్న ఆయకట్టు రైతులు
పూర్తిగా నిండి జలకళ సంతరించుకున్న జలాశయాలు

చెరువులు వెలవెల

చెరువులు వెలవెల