
పిల్లలను ఉన్నతంగా చదివించాలి
జూలూరుపాడు: పిల్లలను తల్లిదండ్రులు ఉన్నత చదువులు చదివించాలని ఎస్పీ రోహిత్ రాజు అన్నారు. ఆదివారం నల్లబండబోడు గ్రామంలో కొత్తగూడెం పట్టణానికి చెందిన ప్రైవేట్ ఆస్పత్రులు, ప్రెస్‌క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్యశిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల బారినపడే ప్రమాదం ఉందని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అనంతరం వైద్యులు ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్, జూలూరుపాడు సీఐ ఇంద్రసేనా రెడ్డి, ఎస్‌ఐ బాదావత్ రవి, డాక్టర్ బాబూరావు, డాక్టర్ రాజశేఖర్ అయ్యప్ప, డాక్టర్ స్రవంతి, కాకర్ల శ్రీసంతాన వేణుగోపాలస్వామి, ఆలయ చైర్మన్ ఢిల్లీ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.