
వర్షం.. రైతుల్లో హర్షం
జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సోమవారం జోరు వాన కురిసింది. పత్తి, ఇతర విత్తనాలు వేసినా.. వర్షాభావంతో మొలకెత్తకపోవడం, కొన్ని చోట్ల మొలకలు వచ్చినా ఎండకు వడబడుతుండగా ఈ వర్షం ఊపిరి పోసిందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. టేకులపల్లి మండలంలోని తూర్పుగూడెం, రాంపురం వాగుల్లోకి నీరు చేరింది. జూలూరుపాడు మండలంలోనూ పలు వాగులు, కుంటల్లోకి నీరు చేరింది. అయితే ఈ వర్షంతో సింగరేణి కొత్తగూడెం ఏరియాలో 25వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం వాటిల్లింది. ఇక కొత్తగూడెంలోని టీఎన్‌జీవో కాలనీలో వర్షపు నీరు చేరగా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు రోడ్లు చెరువులను తలపించాయి.
– సింగరేణి(కొత్తగూడెం)/కొత్తగూడెం అర్బన్/టేకులపల్లి/జూలూరుపాడు

వర్షం.. రైతుల్లో హర్షం

వర్షం.. రైతుల్లో హర్షం

వర్షం.. రైతుల్లో హర్షం