భూ సమస్యల పరిష్కారానికే సదస్సులు
ములకలపల్లి: భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా భూ భారతి రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసినట్లు ఆదనపు కలెక్టర్ వేణుగోపాల్ తెలిపారు. ములకలపల్లి మండలంలో తొలిరోజు కమలాపురం, రాచన్నగూడెం గ్రా మాల్లో నిర్వహించిన సదస్సుల్లో ఆయన మా ట్లాడారు. రైతులకు భూ సమస్యలు ఉంటే ఈ సదస్సుల్లో తప్పక దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అనంతరం దరఖాస్తలను పరిశీ లించారు. ఆయా కార్యక్రమాల్లో తహసీల్దార్ భూక్యా గన్యా, నాయబ్ తహసీల్దార్ భాగ్యలక్ష్మి, ఆర్‌ఐలు సత్యావతి, భద్రు, మాజీ ఎంపీపీ మట్ల నాగమణి తదితరులు పాల్గొన్నారు.
ట్రాన్స్‌ఫార్మర్‌లో
కాపర్ వైర్ చోరీ
కామేపల్లి: మండలంలోని పొన్నేకల్ బుగ్గవాగు ఎత్తిపోతల వద్ద ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌లో కాపర్ వైర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. రైతులు ఇచ్చిన సమాచారంతో ఇరిగేషన్ డీఈఈ శంకర్‌నాయక్, ఏఈఈ రమేశ్ మంగళవారం పరిశీలించారు. కాగా, విద్యుత్ శాఖ అధికారులు మరమ్మతు చేయించి ట్రాన్స్‌ఫార్మర్‌ను వినియోగంలోకి తీసుకురావాలని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గింజల నరసింహారెడ్డి, లిఫ్ట్ ఇరిగేషన్ చైర్మన్ వల్లభనేని అప్పారావు కోరారు.
అదనపు కలెక్టర్ వేణుగోపాల్


