శ్రీసీతారామచంద్రస్వామివారికిసువర్ణ తులసీ అర్చన | - | Sakshi
Sakshi News home page

శ్రీసీతారామచంద్రస్వామివారికిసువర్ణ తులసీ అర్చన

Mar 23 2025 12:13 AM | Updated on Mar 23 2025 12:12 AM

భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామివారి దేవస్థానం అంతరాలయంలోని మూలమూర్తులకు శనివారం సువర్ణ తులసీ అర్చన పూజలు చేశారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం మేళతాళాల నడుమ గర్భగుడి నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి బేడా మండపంలో కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం అనంతరం కంకణధారణ, యజ్ఞోపవేత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి కల్యాణం శాస్త్రోక్తంగా జరిపారు. నిత్యకల్యాణంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

28న రుద్రహోమ పూజలు

పాల్వంచరూరల్‌: పెద్దమ్మతల్లి ఆలయంలో ఈ నెల 28న రుద్రహోమ పూజలు నిర్వహించనున్నట్లు ఈఓ ఎన్‌.రజనీకుమారి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలో శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు యాగశాలలో రుద్రహోమపూజలు నిర్వహించనున్నారు. పూజలో పాల్గొనే భక్తులు రూ.1,516 చెల్లించి గోత్ర నామాలను నమోదు చేసుకోవాలని, సంప్రదాయ దుస్తులు మగవారు ధోతి, కండువా, మహిళలు చీరలు ధరించాలని కోరారు. పూర్తి వివరాలకు 63034 08458 నంబరులో సంప్రదించాలని పేర్కొన్నారు.

నేడు ఉమ్మడి జిల్లాలో

మంత్రి పొంగులేటి పర్యటన

ఖమ్మంవన్‌టౌన్‌: రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10–30 గంటలకు ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రాంతాల్లో బీటీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత తిరుపతమ్మతల్లి ఆలయంలో పూజలు చేయనున్న మంత్రి మధ్యాహ్నం 2–30 గంటలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం విద్యానగర్‌ కాలనీ మీదుగా భద్రాచలం చేరుకుంటారు. అక్కడ ఏఎంసీ కాలనీలో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేస్తారు. సాయంత్రం 4–30 గంటలకు భద్రాచలంలోని మనుబోతుల చెరువు వద్ద తడి, పొడి చెత్త కలెక్షన్‌ సెంటర్‌ను ప్రారంభించాక, సాయంత్రం 5–45 గంటలకు కొత్తగూడెంలోని ఆఫీసర్స్‌ క్లబ్‌లో జరిగే ఇఫ్తార్‌విందులో పాల్గొంటారు.

తగ్గుతున్న

కిన్నెరసాని నీటిమట్టం

పాల్వంచరూరల్‌: వేసవి ఎండలు మండుతుంటడంతో కిన్నెరసాని జలాశయంలో నీటిమట్టం క్రమక్రమంగా తగ్గుతోంది. 407 అడుగుల నీటి నిల్వ సామర్థ్యం కలిగిన రిజర్వాయర్‌లో ఈ నెల 22న (శనివారం) 398.60 అడుగులకు చేరింది. గతేడాది ఇదే రోజు 399.60 అడుగులు నమోదైంది. గతేడాదికంటే అడుగు మేర నీటిమట్టం తగ్గిందని డ్యామ్‌సైడ్‌ ఇంజనీర్‌ తెలిపారు. రిజర్వాయర్‌ నుంచి రోజూ 100 క్యూసెక్కుల జలాలను కేటీపీఎస్‌, నవభారత్‌, ఎన్‌ఎండీసీ కర్మాగారాలకు, కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలకు సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు.

రెండో రోజు

ప్రశాంతంగా పరీక్షలు

కొత్తగూడెంఅర్బన్‌: పదో తరగతి పరీక్షలు రెండో రోజు శనివారం ప్రశాంతంగా జరిగాయి. జిల్లాలో సెకండ్‌ లాంగ్వేజ్‌ హిందీ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని డీఈఓ ఎం.వెంకటేశ్వరాచారి తెలిపారు. పరీక్షకు రెగ్యులర్‌ విద్యార్థులు 12,227 మందికి గాను 12195 మంది హాజరయ్యారని, 32 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. డీఈఓ, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు పల కేంద్రాల్లో తనిఖీలు చేశారు.

శ్రీసీతారామచంద్రస్వామివారికిసువర్ణ తులసీ అర్చన1
1/2

శ్రీసీతారామచంద్రస్వామివారికిసువర్ణ తులసీ అర్చన

శ్రీసీతారామచంద్రస్వామివారికిసువర్ణ తులసీ అర్చన2
2/2

శ్రీసీతారామచంద్రస్వామివారికిసువర్ణ తులసీ అర్చన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement