
అధికారులకు సూచనలు చేస్తున్న హరికిషోర్
మణుగూరు రూరల్ : మండలంలోని జెడ్పీ కో– ఎడ్యుకేషన్ పాఠశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌ను, పీవీ కాలనీ సింగరేణి ఉన్నత పాఠశాల, క్రియేషన్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లను ఎన్నికల సాధారణ పరిశీలకులు ఎస్.హరికిషోర్, రిటర్నింగ్ అధికారి ప్రతీక్ జైన్ మంగళవారం సందర్శించారు. పోలింగ్ నిర్వహణ అంశాలపై అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో అసిస్టెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి వి.రాఘవరెడ్డి, తహసీల్దార్ నాగరాజు, మున్సిపల్ కమిషనర్ ఉమామహేశ్వరరావు, ఆర్‌ఐ శ్రీనివాసరావు పాల్గొన్నారు.