పెదకాకాని: శ్రీకనకదుర్గ అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, పాడి పంటలతో వర్థిల్లాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆరె శ్యామల ఆకాంక్షించారు. పెదకాకాని మండలంలోని వెనిగండ్ల వేమారెడ్డి గుడి వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక పందిరిలో కనకదుర్గ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. మంగళవారం రాత్రి జరిగిన పూజా కార్యక్రమాల్లో ఆరె శ్యామల పాల్గొన్నారు. స్థానిక నాయకులు అతిథులకు సాదర స్వాగతం పలికారు. అర్చకులు అమ్మవారికి ఆరె శ్యామల చేతుల మీదుగా పూజలు జరిపించారు. అనంతరం గోత్రనామ పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. పూజా కార్యక్రమాల్లో మాజీ సర్పంచి కొండమడుగుల శ్రీనివాసరెడ్డి, మాజీ ఉప సర్పంచి కె.వెంకటరెడ్డి, చాగంటి మురళీమోహన్రెడ్డి, వేల్పుల నాగరాజు, మున్నంగి రవి, మాకిరెడ్డి గోపీరామ్రెడ్డి(ఎంజీఆర్), ఆత్మకూరి తిరుమలరెడ్డి, కొండా వేమారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


