బొల్లాపల్లి టోల్‌గేట్‌ వద్ద తప్పిన పెను ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

బొల్లాపల్లి టోల్‌గేట్‌ వద్ద తప్పిన పెను ప్రమాదం

Oct 14 2026 4:29 AM | Updated on Oct 14 2026 4:29 AM

నెల్లూరు డిపోకు చెందిన బస్సులో చెలరేగిన మంటలు

మార్టూరు(యద్దనపూడి): బొల్లాపల్లి టోల్‌గేట్‌ సమీపంలో ఆర్టీసీ బస్సుకు పెనుప్రమాదం తప్పింది. నెల్లూరు డిపోకు చెందిన సూపర్‌ లగ్జరీ బస్సు మంగళవారం తెల్లవారుజామున ప్రయాణికులతో వెళ్తుండగా ఒక్కసారిగా వెనుక టైరు పేలిపోయింది. వెంటనే టైర్లలో మంటలు చెలరేగటంతో ప్రమాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అదే సమయంలో సమీపంలో ఉన్న హైవే మొబైల్‌ పోలీసులు వెంటనే స్పందించి బస్సులో ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించారు. ఆర్పీవీ సిబ్బందికి , హైవే అంబులెన్స్‌ సమాచారం అందించటంతో వారు హుటాహుటిన సంఘటనాస్థలికి చేరుకొని హైవే మొబైల్‌ సిబ్బంది రవి, ఆర్పీవీ సిబ్బంది జ్ఞానేంద్ర ఇరువురూ ఫైర్‌ సిలిండర్‌ సాయంతో మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాద సమయంలో బస్సులో మెత్తం 22 మంది ప్రయాణికులు ఉన్నారు. అధికారుల చొరవతో ఎవరికీ ఎటువంటి గాయాలు కాకుండా సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే సిబ్బంది మరో రెండు ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసి ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చారు. సమయానికి స్పందించి ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించిన పోలీసులను, సహాయక సిబ్బందిని ప్రయాణికులు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement