వైఎస్సార్‌ సీపీ పొన్నూరు పరిశీలకుడిగా మురుగుడు | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీ పొన్నూరు పరిశీలకుడిగా మురుగుడు

Oct 14 2026 4:29 AM | Updated on Oct 14 2026 4:29 AM

పొన్నూరు: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత,

మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ పొన్నూరు నియోజక వర్గ పరిశీలకుడిగా ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది.

నేడు కొల్లిపరలో స్వామినాథన్‌ ఫౌండేషన్‌ బృందం పర్యటన

కొరిటెపాడు (గుంటూరు): కొల్లిపర మండలంలో ప్రకృతి వ్యవసాయ విధానాలను స్వామినాథన్‌ ఫౌండేషన్‌ సభ్యులు బుధవారం పరిశీలించనున్నారు. ఈ మేరకు ప్రకృతి వ్యవసాయం డీపీఎం రాజకుమారి మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మండలంలోని తూములూరు, దవులూరుపాలెం గ్రామాల్లో పర్యటించి, ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేస్తున్న పసుపు, అరటి, బొప్పాయి పంటలను పరిశీలించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా పౌష్టికాహార వనాలను సందర్శించి, ప్రకృతి వ్యవసాయ విధానాల అమలును అధ్యయనం చేయనున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు, న్యూఢిల్లీకి చెందిన సెంటర్‌ ఫర్‌ ఎనర్జీ, ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ వాటర్‌ (సీఈఈడబ్ల్యూ) బృందం కూడా జిల్లాలో పర్యటించనున్నట్లు రాజకుమారి వెల్లడించారు.

హత్యాయత్నం కేసులో నిందితులు అరెస్టు

తాడేపల్లి రూరల్‌: తాడేపల్లి రూరల్‌ పరిధిలోని పెనుమాక గ్రామంలో ఇరువురు వ్యక్తుల మధ్య పాత కక్షల నేపథ్యంలో గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని హత్య చేసేందుకు రెక్కి నిర్వహించిన కేసులో ముగ్గురు వ్యక్తులను తాడేపల్లి పోలీసులు మంగళవారం అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. సేకరించిన సమాచారం మేరకు పెనుమాకు చెందిన కొల్లు శేషు, తమ్మా రామిరెడ్డి ఇరువురు స్నేహితులు, వీరివురి మధ్య గత వారం రోజుల క్రితం స్థలం విషయంలో గొడవ జరగడంతో తమ్మా రామిరెడ్డి అతని మిత్రుడు శేషును హత్య చేయాలనే ఉద్దేశంతో తన అనుచరులతో హత్యాయత్నంకు ప్రయత్నించారు. పోలీసులకు సమాచారం అందడంతో ఎలాంటి అవాంచనీయ సంఘటన జరుగకుండా తమ్మా రామిరెడ్డి, పాతూరు ప్రతాప్‌, తిరుమలరావులను అరెస్టు చేసి మంగళగిరి కోర్టులో హాజరు పరచగా, ఈనెల 25వ తేదీ వరకు రిమాండ్‌ విధించారు.

పెట్రోలుతో బైక్‌ దొంగ హల్‌చల్‌

తెనాలిరూరల్‌: పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఒంటిపై పెట్రోలు పోసుకుని బైక్‌ దొంగ హల్‌చల్‌ చేశాడు. పట్టణ చినరావూరుతోటకు చెందిన బైక్‌ మెకానిక్‌ పలు బైక్‌ చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. రెండు నెలల కిందట ఒక కస్టమరు తన బైక్‌ను రిపేరు చేసివ్వమని ఇచ్చాడు. అటు బైక్‌ రిపేరు చేయనూలేదు, వాహనాన్ని ఇప్మంటే అ్పగించకపోతుండడంతో వాహన యజమాని పోలీసులను ఆశ్రయించాడు. బై చోరీలకు ప్పాడే యువకుడి తండ్రిని పిలిపించిన వన్‌ టౌన్‌ పోలీసులు కస్టమర్‌ వాహనాన్ని అప్పగించాలని సూచించారు. ఇదే విషయాన్ని తన కుమారుడికి చెప్పగా, సదరు బైక్‌ దొంగ పెట్రోలుతో పోలీసుస్టేషన్‌ వద్దకు చేరుకుని ఒంటి మీద పెట్రోలు పోసుకుని హల్‌చల్‌ చేశాడు. పోలీసులు నీళ్లు పోసి సర్ధిచెప్పి పంపారు.

భార్యను వేధిస్తున్న భర్తపై కేసు

తెనాలిరూరల్‌: మరో మహిళతో వివాహేతర సంబంధం ఏర్పరచుకుని భార్యను వేధిస్తున్న భర్తపై కేసు నమోదైంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పట్టణ నాజరుపేటకు చెందిన పవన్‌, సంధ్యలకు 15 ఏళ్ల కిందట వివాహమైంది. భర్త ఐదేళ్లుగా ఏ పని చేయడం లేదు. సంధ్య పుట్టింటి వారు కుటుంబ పోషణ, పిల్లల చదువు ఖర్చులు చూసుకుంటున్నారు. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని భారయను తరచూ వేధిస్తూ పుట్టింటి నుంచి డబ్బులు తీసుకురమ్మంటూ దాడి చేస్తున్నాడు. ఇదేమని ప్రశ్నించేందుకు వచ్చిన అత్తపైనా దాడి చేసి గాయపర్చాడు. భార్య ఫిర్యాదు మేరకు భర్తపై వన్‌ టౌన్‌ ఎస్‌ఐ రాజ్యం కేసు మంగళవారం రాత్రి నమోదు చేశారు.

లారీని బైక్‌ ఢీకొని

వ్యక్తి మృతి

మేడికొండూరు: మండల పరిధిలోని పేరేచర్ల గ్రామ శివారులో మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. వివరాల ప్రకారం.. విశదల గ్రామానికి చెందిన దొడ్డ సుధీర్‌ (24) గుంటూరులోని ఓ మెడికల్‌ షాపులో రాత్రి విధులు ముగించుకుని పల్సర్‌ బైక్‌పై స్వగ్రామానికి బయలుదేరాడు. ఈ క్రమంలో పేరేచర్ల గ్రామ శివారులో ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి బైక్‌ ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సుధీర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి సంబంధించిన వివరాలను సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement