బాపట్ల: ఆంధ్ర ప్రదేశ్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ మెడికల్ సర్వీస్ అసోసియేషన్ ఏపీ హంస బాపట్ల జిల్లా నూతన కార్యవర్గాన్ని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఏపీ హంస రాష్ట్ర అధ్యక్షుడు ఆరోపాల్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ బొక్క కిరణ్ ఎన్నికల అధికారిగా, వై. శ్రీనివాసరావు ఎన్నికల పరిశీలకుడిగా వ్యవహరించారు. జిల్లా నూతన అధ్యక్షుడిగా పసుమర్తి శ్రీనివాసరావు, కార్యదర్శిగా జయ సుధాకర్, కోశాధికారి ఎన్. సుబ్బారావు, సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆరోపాల్ మాట్లాడుతూ అనేక క్యాడర్లతో కూడిన ఉద్యోగులను ఒకే వేదికపై తీసుకువచ్చి వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్యానల్‌లో అసోసియేషన్ ప్రెసిడెంట్ కె. విజయ రాణి, వైస్ ప్రెసిడెంట్ సీహెచ్ శ్రీధర్, ఎం. ప్రమీల, ఎంవీ సుబ్బారావు, కె. శ్యామ్ సుందర్ బాబు తదితరులు ఉన్నారు.


