ఏపీ ఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు పి.నాగేశ్వరరావు
బాపట్ల: ఆరోగ్యశాఖలో కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని ఏపీ ఎన్జీవో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పి.నాగేశ్వరరావు పేర్కొన్నారు. బాపట్లలో చేపట్టిన ధర్నాకు ఏపీ ఎన్జీవోలు, సీఐటీయూ, ఏపీహెచ్‌ఏఎంఎస్‌ఏ, ఏపీజీఈఎస్‌ఏ, ఐఎన్‌టీయూసీ సంఘాలు బుధవారం మద్దతు ప్రకటించాయి. ఈసందర్భంగా ఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు పి.నాగేశ్వరరావు మాట్లాడుతూ కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని తెలిపారు. ఉద్యోగులపై పనిభారం తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధర్నాలో నాయకులు కూరపాటి సత్యంరాజు, శరత్, రెడ్డి, తదితరులు పాల్గొని మద్దతు తెలిపారు.
మధురవాడ: ‘ఒక్కరు నా హృదయంతో ఆడుకున్నారు. అమ్మా.. నాన్నా.. అక్కా క్షమించండి’ అంటూ సూసైడ్ నోట్ రాసి బీటెక్ విద్యార్థి బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. పీఎంపాలెం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాపట్ల జిల్లా నిజాంపట్నం ఫిషర్‌మెన్ కాలనీకి చెందిన కర్రి జ్ఞానేశ్‌వర్మ(19) పీఎంపాలెంలోని బాబా ఇంజినీరింగ్ కళాశాలలో సీఈసీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. హాస్టల్ నచ్చకపోవడంతో 10 రోజుల క్రితం మిథిలాపురి వుడా కాలనీలోని రాచకొండ అపార్ట్‌మెంట్‌లో ఓ ప్లాట్‌కు మారాడు. బుధవారం ఫ్లాట్ నుంచి దుర్వాసన రావడంతో వాచ్‌మెన్ అయిన మహిళ స్థానికులకు సమాచారం ఇచ్చింది. వారు తలుపులు తెరిచి చూడగా జ్వానేశ్‌వర్మ ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించాడు. మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉండటంతో సుమారు ఐదు రోజుల క్రితమే మృతి చెంది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. తల్లిదండ్రులకు సమాచారం అందించినట్లు పీఎంపాలెం పోలీసులు తెలిపారు.


