వైఎస్సార్‌ సీపీలో పలువురికి పదవులు | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీలో పలువురికి పదవులు

Oct 8 2026 3:36 AM | Updated on Oct 8 2026 3:36 AM

వైఎస్సార్‌ సీపీలో పలువురికి పదవులు నెహ్రూనగర్‌: వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీలో పలువురికి పదవులు కేటాయిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. రాష్ట్ర మున్సిపల్‌ వింగ్‌ సెక్రటరీగా చీరాల నియోజకవర్గానికి చెందిన గుంటూరు ప్రభాకరరావు, పార్టీ ఇంకొల్లు మండల అధ్యక్షుడిగా అట్లూరి కోటేశ్వరరావు, పర్చూరు మండల అధ్యక్షుడిగా తోకల కృష్ణమోహన్‌, చినగంజాం మండల అధ్యక్షుడిగా కందూరి గోవింద్‌లను నియమిస్తూ ఉత్తర్వులు వెలువరించారు. రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలకు గురు మణి వర్మ ఎంపిక నగరం: గుంటూరు బీఆర్‌ స్టేడియంలో ఇటీవల నిర్వహించిన ఎస్‌జీఎఫ్‌ఐ అండర్‌–19 జిల్లా స్థాయి తైక్వాండో పోటీల్లో నగరం ఎస్‌వీఆర్‌ఎం ఇంటర్‌ కళాశాల విద్యార్థి కొక్కిలిగడ్డ గురు మణి వర్మ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై న గురు మణి వర్మను బుధవారం స్థానిక కళాశాలలో కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, 4వడాన్‌ తైక్వాండో బ్లాక్‌ బెల్ట్‌ కోచ్‌ కొక్కిలిగడ్డ శ్రీనివాసరావులు అభినందించి, రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ ఉత్తమ ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు. కాలువలో గుర్తుతెలియని మహిళ మృతదేహం రేపల్లె: రేపల్లె– నిజాంపట్నం ప్రధాన మురుగు కాలువలో అచ్చుతపురం వద్ద గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైనట్లు అడవులదీవి ఎస్‌ఐ రాజశేఖర్‌ బుధవారం తెలిపారు. సుమారు 50 నుంచి 55 సంవత్సరాల వయస్సు కలిగిన మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించినట్లు పేర్కొన్నారు. మహిళ మృతి చెంది మూడు రోజులు గడుస్తుందని ప్రాథమికంగా నిర్ధారించినట్లు తెలిపారు. మహిళ శరీరంపై ఆకుపచ్చ జాకెట్‌ ఉందని, చేతులకు గాజులు ఉన్నాయన్నారు. ఆచూకీ తెలిసిన వారు 94409 00887 నంబరును సంప్రదించాలని కోరారు. సీడ్‌ యాక్సిస్‌ రోడ్డుపై ప్రమాదం.. వ్యక్తి మృతి

తాడికొండ: తుళ్ళూరు మండలం మందడం సీడ్‌ యాక్సిస్‌ రోడ్డుపై బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. వివరాల ప్రకారం.. అత్తలూరు గ్రామానికి చెందిన కోట కళ్యాణ్‌ రావు అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై సీడ్‌ యాక్సిస్‌ రోడ్డుపై వస్తుండగా బైక్‌ అదుపుతప్పి ఎదురుగా వస్తున్న హైడ్రాలిక్‌ వాహనం కిందకు దూసుకెళ్లడంతో దుర్మరణం పాలయ్యాడు. సమాచారం అందుకున్న ట్రాఫిక్‌ సీఐ కోటేశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్‌ అదుపు చేశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement