జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్
బాపట్ల: ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమంలో వచ్చే అర్జీల పరిష్కారంపై అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ పేర్కొన్నారు. స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. 167 అర్జీలు నమోదు కాగా, డివిజన్, మండల స్థాయి అధికారులతోనూ కలెక్టర్ వీడియో సమావేశం ద్వారా పీజీఆర్‌ఎస్‌పై సమీక్షించారు. యోగాంధ్ర కార్యక్రమాలు జిల్లా స్థాయి మరియు నియోజకవర్గ స్థాయిలో జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ తెలిపారు. కార్యక్రమాలకు హాజరయ్యే అధికారుల యొక్క హాజరు ఎక్సెల్ షీట్‌లో ప్రతిరోజు వస్తుందని, కార్యక్రమాలకు హాజరు కాని మరియు ఈ–ఆఫీస్ సరిగా నిర్వహించని అధికారులను వ్యక్తిగతంగా పిలిచి విచారణ చేస్తామన్నారు. అధికారులు, సిబ్బంది అందరూ ఎఫ్‌ఆర్‌ఎస్‌లో హాజరు నమోదు చేయాలన్నారు. పై వాటికి సంబంధించి రాష్ట్రస్థాయిలో జిల్లాల వారీగా ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. ఓటర్ల జాబితా ప్రత్యేక మ్యాపింగ్ డ్రైవ్‌పై కలెక్టర్ మండల స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు.


