
ఘనంగా దసరా ఉత్సవాలు ప్రారంభం
చీరాల అర్బన్: దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. పట్టణంలోని చీరాల, పేరాలలోని వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవాలయాలతో పాటు, భావనారుషి దేవాలయం, పేరాల శివాలయంలో, ఎంజీసీ మార్కెట్‌లోని అమ్మవారి దేవాలయం, కామాక్షి అమ్మవారి దేవాలయం తదితర దేవాలయాల్లో ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. దేవాలయాలను విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. సంతబజారులోని వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో ఉత్సవాల్లో భాగంగా ఉదయం అమ్మవారి చిత్రపటంతో నగరోత్సవాన్ని నిర్వహించారు. దేవాలయం నుంచి 1116 మంది మహిళలు కలశ శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం అమ్మవారికి అభిషేకాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు, విశేష అలంకరణలు చేశారు. కార్యక్రమంలో దేవస్థాన అధ్యక్షుడు గుంటూరు మాధవరావు పాల్గొన్నారు. అలానే పేరాలలోని వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో, బెస్తపాలెంలోని సాయిబాబా మందిరంలో, పాపరాజుతోటలోని కామాక్షి అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
జిల్లెళ్లమూడిలో..
బాపట్లటౌన్: జిల్లెళ్ళమూడిలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సోమవారం అమ్మవారికి పసుపు, కుంకుమ, నూతన వస్త్రాలు, నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో విశ్వజనని పరిషత్ ట్రస్ట్ ట్రెజరర్ జె.ఎల్.పి.సుబ్రహ్మణ్యం, అలయ అర్చకులు పాల్గొన్నారు.
దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు
అమృతలూరు(వేమూరు): మండలంలోని గోవాడ బాల కోటేశ్వర స్వామి దేవస్ధానంలో దేవి శరన్నవ రాత్రి మహోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. విగ్నేశ్వర పూజ, అఖండ దీపారాధన, కులశస్థాపన చేసి మొదటి రోజు అమ్మవారిని బాలా త్రిపుర సుందరీ దేవిగా అలంకరించినట్లు అర్చకులు స్వర్ణ వెంకట శ్రీనివాస శర్మ తెలిపారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదం అందజేశారు.
అమ్మవారికి ప్రత్యేక పూజలు
పిట్టలవానిపాలెం(కర్లపాలెం): చందోలు శ్రీ బండ్లమ్మ ఆలయం అల్లూరు రాజ్యలక్ష్మీ సమేత లక్ష్మీనరసింహస్వామి ఆలయం, మంతెనవారిపాలెం రామలింగేశ్వరస్వామి ఆలయం, ఖాజీపాలెం కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయాలతో పాటు మండలంలోని పలు గ్రామాలలో కనకదుర్గమ్మ అమ్మవారి ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేశారు.

ఘనంగా దసరా ఉత్సవాలు ప్రారంభం

ఘనంగా దసరా ఉత్సవాలు ప్రారంభం

ఘనంగా దసరా ఉత్సవాలు ప్రారంభం