
97 రిటర్నబుల్ ప్లాట్ల కేటాయింపు
తాడికొండ: అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన పెనుమాక (జరీబు, మెట్ట), మల్కాపురం(ప్రత్యామ్నాయ ప్లాట్లు) గ్రామాల రైతులకు శుక్రవారం విజయవాడలోని ఏపీ సీఆర్డీఏ కార్యాలయంలో ఈ– లాటరీ విధానంలో 97 రిటర్నబుల్ ప్లాట్లను కేటాయించారు. వీటిలో 41 నివాస ప్లాట్లు కాగా, 36 వాణిజ్య ప్లాట్లు, 20 ప్రత్యామ్నాయ ప్లాట్లు ఉన్నాయి. మొత్తంగా 56 మంది రైతులు, భూయజమానులకు ప్లాట్లను కేటాయించారు. అధికారులు ప్రొవిజనల్ సర్టిఫికెట్లు అందజేశారు. డైరెక్టర్(ల్యాండ్స్)/స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్– క్యాపిటల్ సిటీ) ఎన్‌వీఎస్‌బీ వసంతరాయుడు మాట్లాడుతూ రైతులకు భౌగోళికంగా ప్లాట్లు ఎక్కడ కేటాయించబడ్డాయో వివరించడానికి ప్రత్యేకంగా జి.ఐ.ఎస్. సిబ్బంది, గ్రామ సర్వేయర్లను నియమించామన్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని కోరారు. రుసుము వసూలు చేయబడదని రైతులు గమనించాలని కోరారు.