
క్రీడా కోటాలో డీఎస్సీలో ఉద్యోగాలు
జె.పంగులూరు: ఈ ఏడాది ప్రభుత్వం చేపట్టిన డీఎస్సీలో పోటీ పరీక్షలతో సంబంధం లేకుండా పీఈటీగా ఉద్యోగాలు కల్పించినట్లు ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మేకల సీతారామిరెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు సన్మానం ఏర్పాటు చేశారు. గోవాలో జాతీయ క్రీడల్లో పాల్గొని పతకం సాధించిన సందర్భంగా క్రీడాకారులు ప్రతి ఒక్కరికి వ్యాయామ ఉపాధ్యాయునిగా పోస్టులు ఇస్తున్నట్లు తెలిపారు.
డీఎస్సీలో ఉద్యోగాలు పొందిన క్రీడాకారులు:
పి. శివారెడ్డి (ప్రకాశం), జి. క్రాంతికుమార్ (విశాఖపటణం), ఏ. శివనాగిరెడ్డి (గుంటూరు), వై. సతీష్ ( తూర్పు గోదావరి), ఎల్. సురేష్ (విజయనగరం), ఎల్. అప్పలనాయుడు (పశ్చిమగోదావరి), వై. దాలినాయుడు (కృష్ణ), పి. రామ్మోమెహన్ (కడప), ఏ. రాజ్‌కుమార్ (చిత్తూరు).