
బీచ్ ఫెస్టివల్‌కు అందరు సహకరించాలి
బాపట్ల: ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా సూర్యలంక బీచ్‌లో బీచ్ ఫెస్టివల్ ఘనంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి తెలిపారు. స్థానిక కలెక్టరేట్‌లోని వీక్షణ సమావేశ మందిరంలో శనివారం రియల్ ఎస్టేట్, బంగారు నగల వ్యాపారులు, బీచ్ రిసార్ట్ యాజమాన్యం, రైస్ మిల్లర్స్, పెట్రోల్ బంక్, ఎరువులు, విత్తనాల వ్యాపార సంఘ సభ్యులతో జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 26, 27, 28 తేదీలలో సూర్యలంక, రామాపురం బీచ్‌లలో ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మూడు రోజులు తెలుగుదనం ఉట్టిపడేలా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.4 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. ఫెస్టివల్‌కు ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలు కుటుంబ సమేతంగా వచ్చి ఆహ్లాదకర వాతావరణంలో కార్యక్రమాలు తిలకించే విధంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. సూర్యలంక బీచ్‌లో కార్యక్రమాలను ఘనంగా నిర్వహించేందుకు తమ వంతు ఆర్థిక సహాయం అందజేయాలని కలెక్టర్ సంస్థల సభ్యులకు విజ్ఞప్తి చేశారు. సమావేశంలో ఎమ్మెల్యేలు వేగేశన నరేంద్రవర్మరాజు, ఎం.ఎం.కొండయ్య, ఇన్‌చార్జి సంయుక్త కలెక్టర్ జి. గంగాధర్ గౌడ్, జిల్లా పర్యాటక శాఖ అధికారి నాగిరెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ విజయమ్మ, డీఎస్‌ఓ అమిర్ బాషా, బాపట్ల, చీరాల ఆర్డీఓలు గ్లోరియా చంద్రశేఖర్, బాపట్ల, చీరాల మున్సిపల్ కమిషనర్లు రఘునాథరెడ్డి, అబ్దుల్ రషీద్, బాపట్ల, చీరాల మండలాల తహసీల్దార్లు సలీమా, గోపికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
భూమి సామర్ధ్యం మేరకు యూరియా వాడాలి
సాగు భూమి సామర్థ్యం మేరకు రైతులకు సూచించిన మోతాదులోనే యూరియా వాడాలని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి అన్నారు. యూరియా వినియోగంపై వ్యవసాయ శాఖ అధికారులతో శనివారం స్థానిక కలెక్టరేట్‌లో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. గతేడాది జిల్లాలో 88 వేల హెక్టార్లలో వరి సాగు చేయగా, ప్రస్తుతం 90 వేల హెక్టార్లకు సాగు పెరిగిందన్నారు. ఈ సంవత్సరం ఆగస్టు, సెప్టెంబర్ నెలలలో 2.24 లక్షల ఎకరాలలో రైతులు వరి సాగు ప్రారంభించినట్లు తెలిపారు. పంటల సాగును దృష్టిలో ఉంచుకుని 20వేల టన్నుల యూరియా అవసరం అని అంచనా వేశామన్నారు. ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు 21,609 టన్నుల యూరియా జిల్లాకు విడుదల అయిందన్నారు. వాటిని అన్ని గ్రామాలలోని రైతులకు పంపిణీ చేశామన్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా వ్యవసాయశాఖ ఆధీనంలో 230 టన్నుల యూరియా, డీసీఎంఎస్ వద్ద 500 టన్నులు, సహకార శాఖ వారి వద్ద 530 టన్నులు అందుబాటులో ఉందన్నారు. రైతులకు సరిపడా యూరియా అందుబాటులోనే ఉందని, ఎలాంటి ఆందోళన చెందవద్దని కలెక్టర్ చెప్పారు. శాస్త్రవేత్తల సూచనల మేరకు మాత్రమే యూరియా వాడాలన్నారు. అధిక మోతాదులో వేస్తే కలిగే నష్టాలను రైతులకు వివరించాలన్నారు. సమావేశంలో ఇన్‌చార్జి సంయుక్త కలెక్టర్ జి.గంగాధర్‌గౌడ్, వ్యవసాయశాఖ అధికారి అన్నపూర్ణ, డీసీఓ శ్యాంసన్, మార్క్‌ఫెడ్ జీఎం కరుణశ్రీ, వ్యవసాయ శాఖ ఏడీలు, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి