
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
పోలీస్ వ్యాన్ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం మృతులు పొన్నూరుకు చెందిన దంపతులు
బాపట్ల టౌన్ : పోలీస్ వాహనం ఢీకొని ఇద్దరు మృతి చెందగా...మరో ముగ్గురికి గాయాలైన ఘటన పట్టణ శివారులోని హెరిటేజ్ సమీపంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బాపట్ల జిల్లా ఏఆర్ విభాగంలోని పోలీస్ వ్యాన్ డ్రైవర్ మనోజ్ అవుట్‌సోర్సింగ్ విధానంలో పని చేస్తున్నాడు. శనివారం రాత్రి 8 గంటల సమయంలో పోలీస్ వ్యాన్‌ను సర్వీసింగ్ నిమిత్తం బాపట్ల నుంచి గుంటూరు తీసుకెళ్తున్నాడు. ఫుల్లుగా మద్యం తాగి వాహనాన్ని నడుపుతూ పట్టణంలోని మూర్తి రక్షణ నగర్ సమీపంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న కె. తనూష్‌సాయి, లికిత్‌బాబు, సందీప్‌ను వెనుక నుంచి ఢీకొట్టాడు. ఈ ఘటనలో వీరి ముగ్గురికి గాయాలయ్యాయి. స్థానికులు కేకలు వేయడంతో వాహనాన్ని మరింత వేగంగా నడుపుతూ పొన్నూరు నుంచి బాపట్ల వైపు ద్విచక్రవాహనంపై వస్తున్న దంపతులను ఢీకొట్టాడు. ఈ ఘటనలో దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను పొన్నూరు పట్టణంలోని శ్రీనగర్ కాలనీ, 6వ లైనుకు చెందిన కన్నటి మురళి, అతని భార్య లక్ష్మీతిరుపతమ్మగా గుర్తించారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి