
చైల్డ్ కేర్ లీవ్‌లను అమలు చేయాలి
బాపట్ల అర్బన్: మహిళా ఉద్యోగులకు ప్రభుత్వం ప్రకటించిన చైల్డ్ కేర్ లీవులను అమలు చేయాలని జిల్లా జేఏసీ చైర్మన్ సురేష్‌బాబు కోరారు. మహిళా విభాగం ఏర్పాటు చేసి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా కలెక్టరేట్‌లో జేసీ గంగాధర్‌గౌడ్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా చైర్మన్ సురేష్‌బాబు మాట్లాడుతూ మహిళలకు ప్రభుత్వం కేటాయించిన సెలవులను అమలు చేయాలని కోరారు. పెండింగ్ డీఏలను ఇవ్వడంతో పాటు పీఆర్సీను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మహిళా విభాగం నాయకులు కె.రజని, హాజర బేగం పాల్గొన్నారు.