
సాంకేతిక లోపంతో నిలిచిన శబరీ ఎక్స్‌ప్రెస్
మద్యం అక్రమ కేసులో ముగ్గురు విడుదల హర్షణీయం వైఎస్సార్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు
బాపట్ల: సికింద్రాబాద్ నుంచి తిరువనంతపురం వెళ్లే శబరి ఎక్స్‌ప్రెస్ రైలు సాంకేతిక లోపంతో బాపట్లలో అర గంటకు పైగా నిలిచిపోయింది. బాపట్ల స్టేషన్‌లో రైలు నిలిచిపోవటంతో ప్రయాణికులు కొద్దిసేపు కంగారుపడ్డారు. ఇంజనీరింగ్ అధికారులు సాంకేతిక లోపాన్ని సరిచేసి అరగంట ఆలస్యంగా నడిపారు.
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): సుమారు 120 రోజుల నిర్బంధం, జ్యుడీషియల్ రిమాండ్ తర్వాత ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డి, గ్రూప్–1 అధికారి కృష్ణమోహన్‌రెడ్డి, ప్రముఖ సీఏ గోవిందప్పలకు విజయవాడ ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేయడం హర్షణీయమని వైఎస్సార్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. గుంటూరు బృందావన్ గార్డెన్స్‌లోని పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. దుర్మార్గమైన కేసు ఇదని అన్నారు. లిక్కర్‌లో అసలు స్కాం చేసే అవకాశం లేకపోయినా కావాలని క్రియేట్ చేశారని ఆరోపించారు. సిట్ అధికారులు రాజకీయ కక్ష తీర్చేందుకు పనిచేస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతోందని చెప్పారు. రాబోయే రోజుల్లో చాలా విషయాలు బయటకు వస్తాయని తెలిపారు. వైఎస్ జగన్‌పై కక్ష సాధింపు చర్యలు చేపట్టాలనే దురుద్దేశపూర్వకంగా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరించిందని ఆరోపించారు. వేధింపులకు గురిచేసిన టీడీపీ ప్రభుత్వం.. తర్వాత బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు.