
నూటా నూతన కార్యవర్గం ఎన్నిక
పెదకాకాని (ఏఎన్‌యూ): ఆచార్య నాగార్జున యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (నూటా) నూతన అధ్యక్ష, కార్యదర్శులుగా ఆచార్య పండు బ్రహ్మాజీరావు, ఆచార్య ఎం.త్రిమూర్తిరావులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలకు సంబంధించిన ఉత్తర్వులను ఎలక్షన్ అధికారి ఆచార్య ఎస్.మురళీమోహన్ శనివారం విడుదల చేశారు. పర్యావరణ విభాగానికి చెందిన ఆచార్య పండు బ్రహ్మాజీరావు అధ్యక్షుడిగా, సోషియాలజీ, సోషల్ వర్క్ విభాగానికి చెందిన ఆచార్య ఎం.త్రిమూర్తి రావు కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా కెమిస్ట్రీ విభాగానికి చెందిన ఆచార్య ఎం.సుబ్బారావు, సహాయ కార్యదర్శిగా ఆచార్య డి.రామచంద్రన్, కోశాధికారిగా ఫిజిక్స్ విభాగానికి చెందిన ఆచార్య చేబ్రోలు లింగరాజు ఎన్నికయ్యారు. సైన్స్ రిప్రజెంటేటివ్‌గా టెక్నాలజీ విభాగానికి చెందిన డాక్టర్ బి.సుధాకర్, కంప్యూటర్ సైన్స్ విభాగానికి చెందిన డాక్టర్ కె.లావణ్య, ఆర్ట్స్ రిప్రజెంటేటివ్‌గా సోషియాలజీ విభాగానికి చెందిన ఆచార్య వై.అశోక్ కుమార్, మానవ వనరుల విభాగానికి చెందిన ఆచార్య వి.తులసీదాస్‌లు ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గాన్ని వర్సిటీ వీసీ ఆచార్య కె.గంగాధరరావు, రెక్టార్ ఆచార్య రత్నషీలామణి అభినందించారు.

నూటా నూతన కార్యవర్గం ఎన్నిక