
తురకపాలెం గ్రామస్తులను ఆదుకోవాలి
చీరాల రూరల్ : గుంటూరు సమీపంలోని తురకపాలెం గ్రామస్తులను ప్రభుత్వం ఆదుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైద్యుల విభాగం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఇస్తర్ల బాబూరావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శనివారం తన హాస్పిటల్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. తురకపాలెం గ్రామ సమీపంలో అనేకమంది భూమిలోకి వందల అడుగుల లోతులో బోర్లు దించి మంచినీటిని అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారని చెప్పారు. అక్రమార్కుల చర్యలతో సమీపంలో నివాసముంటన్న తురకపాలెం గ్రామస్తులకు తమ ఇంటి బోర్లలో నీళ్లురాక నానా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అయితే వారంతా మంచినీటికి అలమటించి కుంటల్లోని కలుషితమైన నీటిని తాగుతూ వ్యాధుల బారిన పడుతున్నారని చెప్పారు. చిన్నా.. పెద్దా అనే తేడా లేకుండా నెలల వ్యవధిలోనే 48 మంది ఎస్సీ కాలనీ వాసులు చనిపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే మంచి నీటిని అమ్ముకుంటున్న వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు కాలనీ వాసులకు రక్షిత మంచినీటి సౌకర్యం కల్పించాలని, వ్యాధుల బారినపడి మృతి చెందిన వారికి నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
వైఎస్సార్ సీపీ వైద్యుల విభాగం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఇస్తర్ల బాబూరావు