చీరాల వాసికి అరుదైన అవకాశం | - | Sakshi
Sakshi News home page

చీరాల వాసికి అరుదైన అవకాశం

Sep 7 2025 7:38 AM | Updated on Sep 7 2025 7:38 AM

చీరాల వాసికి అరుదైన అవకాశం

చీరాల వాసికి అరుదైన అవకాశం

చీరాల వాసికి అరుదైన అవకాశం

చీరాలటౌన్‌: దేశ రాజధాని ఢిల్లీలో ఈనెల 12 వరకు జరగనున్న ఆల్‌ ఇండియా తల్‌ సైనిక్‌ క్యాంపునకు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ డైరెక్టరేట్‌లకు ఏఎన్‌ఓ మేడికొండ రాజేష్‌బాబు నాయకత్వం వహించనున్నారు. ఈయన చీరాల వాసి కావడంతో ఎన్‌సీసీ క్యాడెట్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 23 ఆంధ్రా బెటాలియన్‌కు చెందిన అసోసియేట్‌ ఎన్‌సీసీ ఆఫీసర్‌గా పనిచేస్తున్న లెఫ్టినెంట్‌ మేడికొండ రాజేష్‌బాబు చీరాల ప్రసాద్‌నగర్‌ నివాసి. ఎంబీఏ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌తోపాటు ఏఎన్‌వోగా నరసరావుపేట ఇంజినీరింగ్‌ కళాశాలలో పనిచేస్తున్న రాజేష్‌బాబు ఆల్‌ ఇండియా తల్‌ సైనిక్‌ క్యాంపులో ఏపీ, టీజీ రాష్ట్రాల డైరెక్టరేట్‌ల తరఫున కాంటిజెంట్‌ కమాండర్‌గా ఎంపిక చేశారు. చీరాల వీఆర్‌ఎస్‌ అండ్‌వైఆర్‌ఎన్‌ కళాశాలలో ఎన్‌సీసీలో శిక్షణ పొంది పలు క్యాంపుల్లో పాల్గొనడంతోపాటు ఎన్‌సీసీ అధికారిగా, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఈనెల 12 వరకు న్యూ ఢిల్లీలో జరిగే ఏఐటీయూసీ క్యాంపునకు దేశంలోని 17 డైరెక్టరేట్‌లు పాల్గొననున్నాయి. జాతీయ వేదికపై రెండు రాష్ట్రాలకు కాంటిజెంట్‌ కమాండర్‌గా ఎంపిక చేయడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఢిల్లీ ఎన్‌సీసీ క్యాంపునకు నేతృత్వం

వహించనున్న రాజేష్‌బాబు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement