అలలపై వలల వేట | - | Sakshi
Sakshi News home page

అలలపై వలల వేట

Jun 17 2025 5:16 AM | Updated on Jun 17 2025 5:16 AM

అలలపై

అలలపై వలల వేట

● రెండు నెలల విరామం తరువాత కడలి వైపు మత్స్యకారుల పయనం ● జూన్‌ 14వ తేదీతో ముగిసిన వేట నిషేధం ● నిజాంపట్నం హార్బర్‌లో సందడి వాతావరణం ● మొగ సామర్ధ్యం పెంపుతో మత్స్యకారుల్లో ఆనందం

రేపల్లె: సముద్రంలో మత్స్య సంపద అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఏటా ప్రభుత్వం మార్చి 15వ తేదీ నుంచి జూన్‌ 14వ తేదీ వరకు 61 రోజులపాటు సముద్రపు వేట నిషేధం అమలు చేయడం జరుగుతుంది. వేటపై నిషేధం పూర్తి అవ్వడంతో జూన్‌ 15వ తేదీ నుంచి మత్స్యకారులు తిరిగి సముద్రంలోకి వేటకు వెళ్లేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని సముద్ర తీర ప్రాంతమైన నిజాంపట్నం హార్బర్‌ నుంచి వందలాది బోట్లు సముద్ర వేటకు వెళ్లేందుకు ఇప్పటికే సిద్ధమయ్యాయి. వేట నిషేధ సమయం పూర్తయిన తర్వాత తొలిసారిగా సముద్రపు వేటకు వెళ్తున్న గంగపుత్రులు మత్య్స సంపద సంవృద్ధిగా లభించాలని ఇష్టదైవంకు పూజలు చేసుకొని బయలుదేరుతున్నారు. దీంతో హార్బర్‌ ప్రాంగణం సందడి వాతవరణం నెలకొంది. సుదీర్ఘ విరామం తరువాత తొలి వేటలో మత్స్యసంపద అధికంగా లభిస్తుంటుంది. దీంతో ఎన్నో ఆశలతో గంగపుత్రులు కడలివైపు పయనమయ్యారు.

మొగ వద్ద సాఫీగా...

హార్బర్‌ నుంచి సముద్రంలోకి రాకపోకలు సాగించే మొగ వద్ద బోట్లు సాఫీగా సాగిపోతుండటంతో మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో రూ.451 కోట్లతో జరుగుతున్న హార్బర్‌ రెండో దశ అభివృద్ధి పనుల్లో భాగంగా ఇప్పటికే మొగ సామర్ధ్యం పెంపుదల పనులు పూర్తి కావడంతో మొగ వద్ద బోట్ల రాకపోకలు సాఫీగా సాగుతున్నాయి. దీంతో మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంతో హార్బర్‌ నుంచి సముద్రంలోని రాకపోకలు సాగించాలంటే ఆటుపోట్లకు అనుగుణంగా సాగించాల్సిన పరిస్థితి నెలకొంది. ఆ సమయంలో ఎన్నో గంటల సమయంలో వేచి ఉండటం, ఒక్కొక్క సమయంలో మొగ వద్ద బోట్లు అడుగు భాగం నేలకు తగిలి దెబ్బతినటం వంటి పరిణామాలతో మత్స్యకారులు వ్యయప్రయాసలకు లోను కావాల్సిన దుస్థితి ఏర్పడేది. ఈ పరిస్థితుల్లో హార్బర్‌ రెండో దశ అభివృద్ధి పనులు ప్రారంభించటం మరీ ముఖ్యంగా మొగ సామార్ధ్యం పెంచటంతోపాటు మొగకు ఇరువైపులా 1570 మీటర్ల బౌల్డర్స్‌ ఏర్పాటుతో ఆధునీకరించే పనులు వేగవంతంగా పూర్తికావటంతో హార్బర్‌ నుంచి సముద్రంలోకి రాకపోకలు ఏసమయంలోనైనా సులభతరమయ్యాయి. దీంతో మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సిద్ధమైన బోట్లు

వేట నిషేధ సమయంలో బోట్లకు మరమ్మతులు పూర్తి చేసి రంగులు వేయించటం, వలలను రిపేరు చేయటం వంటి పనులు పూర్తి చేసుకున్నారు. వేటకు వెళ్లేందుకు ఉప్పు, ఐస్‌, తాగునీరు, వంట సామాగ్రి, డీజిల్‌ తదితరాలు సిద్ధం చేసుకుని వేటకు పయనమయ్యారు.

అలలపై వలల వేట1
1/1

అలలపై వలల వేట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement