Today Telugu Horoscope: ఈ రాశి వారికి పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు | Daily Horoscope: 14 November 2023 In Telugu - Sakshi
Sakshi News home page

Today Telugu Horoscope: ఈ రాశి వారికి పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు

Nov 14 2023 5:43 AM | Updated on Nov 14 2023 8:16 AM

daily horoscope 14 11 2023 rashi phalal in telugu  - Sakshi

శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు కార్తీక మాసం, తిథి: శు.పాడ్యమి ప.2.21 వరకు, తదుపరి విదియ, నక్షత్రం: అనూరాధ  తె.4.10 వరకు (తెల్లవారితే బుధవారం), తదుపరి జ్యేష్ఠ, వర్జ్యం: ఉ.7.54 నుండి 9.31 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.22 నుండి 9.08 వరకు, తదుపరి రా.10.26 నుండి 11.19 వరకు,అమృతఘడియలు: సా.5.36 నుండి 7.13 వరకు , రాహుకాలం : ప.3.00 నుండి 4.30 వరకు, యమగండం :  ఉ.9.00 నుండి 10.30 వరకు, సూర్యోదయం : 6.08, సూర్యాస్తమయం :  5.21.

మేషం... మిత్రులతో మాటపట్టింపులు. ధనవ్యయం. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. దూరప్రయాణాలు. అనారోగ్య సూచనలు. వ్యాపార, ఉద్యోగాలు కొంత నిరాశాజనకంగా ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన.

వృషభం.. ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి. ఆలయాలు సందర్శిస్తారు. విద్యార్థులకు అనుకూలం.

మిథునం..... పూర్వపు మిత్రులను కలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు కొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలస్థితి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

కర్కాటకం... కొన్ని పనులలో ప్రతిబంధకాలు. ఆర్థిక ఇబ్బందులు. అనుకోని ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరిన్ని చికాకులు. అనారోగ్యం.

సింహం... పనులు కొన్ని వాయిదా పడతాయి. ఆకస్మిక ప్రయాణాలు. కొత్తగా రుణాలు చేస్తారు. బంధువర్గంతో వివాదాలు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యభంగం.

కన్య... ఉద్యోగలాభం.  వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం. దైవదర్శనాలు.

తుల.... పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. వ్యయప్రయాసలు. కుటుంబసభ్యులతో వివాదాలు. అనుకోని ప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలు సాదాసీదాగా  ఉంటాయి. దైవదర్శనాలు.

వృశ్చికం.... కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. వాహనయోగం. ప్రముఖుల నుంచి ముఖ్య విషయాలు తెలుసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలత. సంఘంలో గౌరవం.

ధనుస్సు... వ్యయప్రయాసలు. ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తుంది. అనారోగ్యం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. శ్రమ పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు. దూరప్రయాణాలు.

మకరం..... పనులు విజయవంతంగా ముగిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. రుణఒత్తిడులు తొలగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభ చాటుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి.

కుంభం..... పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. పనుల్లో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.

మీనం..... ఆకస్మిక ప్రయాణాలు. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. మిత్రులతో మాటపట్టింపులు. పనుల్లో జాప్యం. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. అనారోగ్యం. దైవదర్శనాలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement