జాతీయ స్థాయిలో మెరిసిన మనోళ్లు | - | Sakshi
Sakshi News home page

జాతీయ స్థాయిలో మెరిసిన మనోళ్లు

Oct 6 2026 1:00 AM | Updated on Oct 6 2026 1:00 AM

పులివెందుల : జాతీయ స్థాయి పోటీ పరీక్షలో పులివెందుల ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ కళాశాల విద్యార్థులు మెరిశారు. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ (ఐకార్‌) నిర్వహించిన పీజీ (ఏఐఈఈఏ) పరీక్షలో ఉత్తమ ర్యాంకులు సాధించారు.

పట్టణంలోని ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ కళాశాల అసోసియేట్‌ డీన్‌ కార్యాలయంలో అసోసియేట్‌ డీన్‌ డాక్టర్‌ ఎం.మాధవ సోమవారం వివరాలు వెల్లడించారు. ఈ ఏడాది తమ కళాశాల విద్యార్థులు ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ (ఐకార్‌) నిర్వహించిన పీజీ (ఏఐఈఈఏ) పరీక్షలో ఉత్తమ ర్యాంకులు సాధించారని తెలిపారు. ఈ ఏడాది ఐకార్‌ ప్రకటించిన ఫలితాల్లో కళాశాలకు చెందిన సుప్రియ అనే విద్యార్థినికి ఆలిండియా 3వ ర్యాంకు వచ్చిందన్నారు. ఈ ఫలితం కళాశాలకు, విశ్వవిద్యాలయానికి గర్వకారణమన్నారు. ఓబీసీ కేటగిరీలో విద్యార్థులు షబ్నం 26వ ర్యాంకు, రవితేజ 60, భాస్కర్‌ 79, మనస్విని 96, భవాని 101వ ర్యాంకులు సాధించారన్నారు. ఎస్సీ కేటగిరీలో జ్యోతిర్మయి 10, మాధవిలత 17, డేని బాబు 20, రాజ్‌ కుమార్‌ 27, సుస్మిత 29, నవ్య 76వ ర్యాంకులు తెచ్చుకున్నారని తెలిపారు. ఈడబ్ల్యూఎస్‌ క్యాటగిరీలో జ్యోతిష్‌ 23వ ర్యాంకు కై వసం చేసుకున్నారని పేర్కొన్నారు.

జనరల్‌ కేటగిరీలో సుప్రియ 3, ప్రీతిరెడ్డి 93, పురుషోత్తం 108, మహాలక్ష్మి 129, కావ్య ప్రియ 146, నుస్రత్‌ సుల్తానా 223, హర్షవర్ధన్‌ రెడ్డి 361వ ర్యాంకులు సాధించారని వివరించారు. దీంతో పులివెందుల ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ కళాశాల, ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు మంచి పేరు తీసుకొచ్చారన్నారు. ఈ సందర్భంగా ప్రతిభ చాటిన 19 మంది విద్యార్థులను, ఇటువంటి ఉత్తమ ఫలితాలకు కారణమైన కళాశాల అధ్యాపకులను అసోసియేట్‌ డీన్‌ అభినందించారు. గతేడాది లాగే ఈ ఏడాది కూడా గేట్‌ వంటి పోటీ పరీక్షల్లో తమ కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారన్నారు. అంకితభావం గల అధ్యాపకులు, తరగతుల బోధన, అత్యాధునిక ప్రయోగశాలలు కళాశాలలో ఉండడం వల్ల ఇటువంటి ఉత్తమ ఫలితాలు సాధ్యమయ్యాయని వివరించారు.

● పులివెందుల ఫుడ్‌ సైన్స్‌ టెక్నాలజీ కళాశాల విద్యార్థుల ప్రతిభ

● అఖిల భారత స్థాయి ప్రవేశ పరీక్షలో ఉత్తమ ర్యాంకులు

● ఆలిండియా 3వ ర్యాంకు కై వసం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement