ఉపాధ్యాయుడు వెంకటేశ్వర్లుపై సమగ్ర విచారణ | - | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయుడు వెంకటేశ్వర్లుపై సమగ్ర విచారణ

Oct 6 2026 1:00 AM | Updated on Oct 6 2026 1:00 AM

● హెచ్‌ఎం, ఎంఈఓ వ్యవహారశైలిపై ఆరా

● స్పష్టం చేసిన డిప్యూటీ డీఈఓ నాగయ్య

● ‘సాక్షి’ కథనంతో కదిలిన విద్యాశాఖ యంత్రాంగం

గాలివీడు : విద్యార్థినితో ఉపాధ్యాయుడు వెంకటేశ్వర్లు అనుచితంగా వ్యవహరించాడన్న ఆరోపణల నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు సమగ్ర విచారణ చేపట్టారు. అక్టోబర్‌ 3న సాక్షి దినపత్రికలో ‘విద్యార్థినికి ప్రేమ పాఠాలు నేర్పుతున్న ఉపాధ్యాయుడు’ అనే శీర్షికతో ప్రచురితమైన కథనంపై జిల్లా విద్యాశాఖాధికారుల ఆదేశాల మేరకు డిప్యూటీ డీఈఓ నాగయ్య సోమవారం వెలిగల్లులోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను సందర్శించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, సంబంధిత విద్యార్థులు, ఇతర సిబ్బందిని విచారించి వివరాలను సేకరించినట్లు తెలిసింది. అనంతరం బాధిత విద్యార్థిని తల్లి, కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి వాదనలు, అభిప్రాయాలను లిఖితపూర్వకంగా నమోదు చేసుకున్నారు. ఆరోపణలకు సంబంధించిన వాస్తవాలను అన్ని కోణాల్లో పరిశీలించినట్లు సమాచారం. ఆదివారం ఎంఈఓ, హెచ్‌ఎం విద్యార్థిని ఇంటికి వెళ్లి ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని బెదిరించారన్న ఆరోపణలపైనా డిప్యూటీ డీఈఓ ఆరా తీసినట్లు తెలిసింది. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఎంఈఓ వ్యవహారశైలికి సంబంధించిన అంశాలను కూడా విచారణ పరిధిలోకి తీసుకున్నట్లు సమాచారం. విచారణ అనంతరం సంబంధిత విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడి నుంచి సేకరించిన వివరాలను క్రోడీకరించి సమగ్ర నివేదికను జిల్లా విద్యాధికారికి సమర్పించనున్నట్లు డిప్యూటీ డీఈఓ నాగయ్య స్పష్టం చేశారు. నివేదిక ఆధారంగా ఉన్నతాధికారులు తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement