ఆలయ నిర్మాణంలో మోసం | - | Sakshi
Sakshi News home page

ఆలయ నిర్మాణంలో మోసం

Oct 6 2026 1:00 AM | Updated on Oct 6 2026 1:00 AM

9 మందిపై కేసు నమోదు

మదనపల్లె టౌన్‌ : అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లెలో ఆలయ నిర్మాణం పేరుతో మోసానికి పాల్పడ్డారంటూ 9 మందిపై వన్‌టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. డా.కజినన్స్‌ స్ట్రీట్‌కు చెందిన 81 ఏళ్ల భాస్కర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి కుప్పం గుల్లేపల్లెకు చెందిన టి.దండపాణితో రూ.23 లక్షలకు ఒప్పందం చేసుకున్నారు. పని పూర్తి కాకుండానే రూ.21,24,000 వసూలు చేసి, రెండు గ్రానైట్‌ పాలిషింగ్‌ మెషీన్లను ధ్వంసం చేసి పనులు నిలిపివేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు తొమ్మిది మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

యువకుడి మృతిపై

అనుమానాలు?

పెద్దతిప్పసముద్రం : మండలంలోని కందుకూరులో అదృశ్యమైన డేగల నరేంద్ర (23) స్థానికంగానే బస్టాండ్‌ సమీపంలో ఉన్న ఓ ఇంటి పక్కన తొట్టెలో పడి మృతి చెందారు. మత్తు పదార్థాలకు అలవాటు పడిన యువకుడు వారం రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లాడు. ఐదు రోజుల క్రితమే మృతి చెందడం, మృతదేహం దుర్వాసన వస్తుండటంతో ప్రజలు భయాందోళన చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించేందుకు కూడా వీలు లేకుండా పోయింది. దీంతో సోమవారం ఘటనా స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించి అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. బస్టాండ్‌ పరిసర ప్రాంతమంతా దుర్వాసన వస్తుండటంతో తిను బండారాల హోటళ్లు కూడా మూసివేశారు. అయితే యువకుడి మృతిపై పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుడి సెల్‌ఫోన్‌ నుంచి వారి కుటుంబ సభ్యులకు శనివారం హాయ్‌ అని మెసేజ్‌ వచ్చినట్లు తెలుస్తోంది. ఆ సెల్‌ఫోన్‌ ఎవరి వద్ద ఉంది, ఎవరు మెసేజ్‌ చేశారు, యువకుడు అతిగా మద్యం తాగి మృతి చెందాడా, లేక ఇతర కారణాలు ఉన్నాయా అనేది పోస్టుమార్టం నివేదిక ద్వారా తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement