ఉత్సాహంగా కరాటే పోటీలు | - | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా కరాటే పోటీలు

Oct 6 2026 1:00 AM | Updated on Oct 6 2026 1:00 AM

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ : కడప నగరంలోని డీఎస్‌ఏ ఇండోర్‌ స్టేడియంలో సోమవారం 5వ సౌత్‌ ఇండియా ఇంటర్నేషనల్‌ కరాటే ఛాంపియన్‌షిప్‌ పోటీలు ఉత్సాహంగా జరిగినట్లు ఆంధ్రప్రదేశ్‌ కరాటే ఆఫ్‌ జనరల్‌ సెక్రటరీ విజయ్‌ పేర్కొన్నారు. కరాటే అసోసియేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షులు కోలా ప్రతాప్‌, ఇంటర్నేషనల్‌ ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ డైరెక్టర్‌ వివేకానంద, వివేకానంద జూనియర్‌ కాలేజ్‌ కరస్పాండెంట్‌ మధుసూదన్‌రెడ్డి పోటీలను పర్యవేక్షించారు. ఈ ఛాంపియన్‌షిప్‌ను విజయ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి సుమారు 500 మంది కరాటే విద్యార్థులు, మాస్టర్స్‌, కోచ్‌లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement