అన్నమయ్య జిల్లా కురబలకోట
మండలం నాగసాల కోట సమీపంలోని కొండల్లో శతాబ్దాల కాలంగా
ఎండ, వాన, గాలికి తట్టుకుంటూ
ఒకదానిపై ఒకటిగా నిలిచిన అద్భుత
బండరాళ్ల అమరిక ఇది.
ప్రకృతి విన్యాసానికి అద్దం పడుతున్న ఈ వింత దృశ్యాన్ని ఆదివారం
మదనపల్లెకు చెందిన ట్రెక్కింగ్ సభ్యులు తమ కెమెరాల్లో క్లిక్ మనిపించారు.
–మదనపల్లె (కురబలకోట)


