సదుం : మండల కేంద్రంలోని పోలీస్ గ్రౌండ్స్‌లో ఆదివారం జూనియర్, సబ్ జూనియర్ బాలుర జిల్లా కబడ్డీ జట్ల ఎంపిక జరిగిందని ఉమ్మడి చిత్తూరు జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షురాలు మమతా రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ రవీంద్ర రెడ్డి తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 50 మంది క్రీడా కారులు హాజరు కాగా 14 మందిని జూనియర్ జట్టుకు, 14 మందిని సబ్ జూనియర్ జట్టుకు ఎంపిక చేశామన్నారు. జూనియర్లు ఈనెల 16 నుంచి మార్కాపురంలో జరిగే 52వ రాష్ట్ర స్థాయి పోటలలో, సబ్ జూనియర్స్ పశ్చిమ గోదావరిలో 10 నుంచే జరిగే 36వ రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారని చెప్పారు. కార్యక్రమంలో సీనియర్ క్రీడాకారులు గుల్జార్, పీడీ పవిత్ర పాల్గొన్నారు.
జూనియర్ జట్టు : తరుణ్, దివాకర్, సునీల్, ధరణీధర్, సంతోశ్, బాలాజీ, అజయ్(సదుం), షారుకేష్ (నిండ్ర), గౌతమ్, చరణ్‌తేజ్, కల్యాణ్ (పలమనేరు), సంతోష్(చిత్తూరు) ఉన్నారు. స్టాండ్‌బై క్రీడాకారులుగా చినబాబు, తన్నవన్, తేజేష్ ఎంపికయ్యారు.
సబ్‌జూనియర్ జట్టు : తరుణ్, భరత్, ధరణీధర్, బాలాజీ, గుణ (సదుం), సంతోష్, త్రివేండ్ర(పలమనేరు), వెంకటేశ్ (నిండ్ర), హర్ష(పుంగనూరు), నాగేశ్వర, వంశీ(ఎంజేపీ, సదుం), వినయ్ కిశోర్, అయూబ్(వీకోట), మహేష్‌కుమార్, (పులిచర్ల) ఉన్నారు. స్టాండ్‌బై క్రీడాకారులుగా రిహాం, గురుప్రసాద్, సంతోష్ ఎంపికయ్యారు.


