కుగ్రామాల్లోని ప్రతి కుటుంబంతో మాకు అనుభంధం ఉంది. వైఎస్సార్‌సీపీ పాలనలో మేము పార్టీలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా అన్ని రకాల సంక్షేమ పథకాలను ప్రజలకు అందించాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మాకు రెట్టింపు జీతం ఇస్తామని మభ్యపెట్టి తీరా అధికారంలోకి వచ్చాకా వలంటీర్ వ్యవస్థ లేకుండా చేశారు. సోషల్ మీడియా ప్రచారం కోసం ఇన్‌ఫ్లూయెన్సర్లకు రూ.లక్షల ప్రజాధనం కుమ్మరించడం సమంజసమా. ప్రజల కష్ట సుఖాలను కళ్లారా చూసిన మాలాంటి వారికి విలువ ఇవ్వకుండా ప్రచార ఆర్బాటాలకు పెద్దపీట వేయడం సరికాదు. – చిన్నిపల్లి మనోహర్. పోతుపేట.పెద్దతిప్పసముద్రం మండలం


