కలికిరి : విద్యుత్ షాక్‌తో ఓ యువ రైతు మృతి చెందిన ఘటన ఆదివారం కలికిరి మండల పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు... కలికిరి పంచాయతీ కె.మాదిగపల్లికి చెందిన వరగాని రమేష్ (37) ఆదివారం ఉదయం 9 గంటలకు పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లారు. ఉదయం 11 గంటలైనా తిరిగి రాకపోవడంతో అతడి మేనమామ వెంకటరమణ పొలం వద్దకు వెళ్లి చూడగా బోరు వద్ద విద్యుత్ షాక్‌కు గురై పడి ఉండటం గమనించి కలికిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు రమేష్ మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి భార్య గాయత్రి ఫిర్యాదు మేరకు హెడ్‌కానిస్టేబుల్ రామచంద్ర కేసు నమోదు చేసి పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.


