భూమిపై ఉన్న అత్యంత తెలివైన, గంభీరమైన వన్యప్రాణులలో ఏనుగులు అగ్రస్థానంలో నిలుస్తాయి. పర్యావరణ వ్యవస్థను సమతుల్యంగా ఉంచడంలో వాటిని ‘అడవుల సంరక్షకులు’గా పిలుస్తాం. అయితే, ప్రస్తుతం భారతదేశంలో నెలకొన్న పరిస్థితులు ఈ గజరాజుల ఉనికికే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది అన్నదాతల జీవనోపాధికి కూడా పెద్ద సవాలుగా మారాయి. ఇటీవల అన్నమయ్య జిల్లా శివారు, చిత్తూరు జిల్లా పులిచెర్ల (కల్లూరు) మండలంలో ఏనుగుల గుంపు హఠాత్తుగా చొరబడి వరి, అరటి, మామిడి, కొబ్బరి తోటలను పూర్తిగా ధ్వంసం చేసింది. ఎందరో అన్నదాతలు చేతికొచ్చే పంట నేలపాలై కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ స్థానిక సమస్య కేవలం ఒక జిల్లాకో, రాష్ట్రానికో పరిమితమైంది కాదు.. ఇది నేడు జాతీయస్థాయిలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ‘మానవ–వన్యప్రాణి సంఘర్షణ’కు సజీవ సాక్ష్యం. (షేక్ ముజుబుద్దీన్)
● ముక్కలవుతున్న అడవులు.. పొలాలపై భీకరి దాడులు
● గజ..గజ.. వణుకుతున్న రైతులు


