రాయచోటి టౌన్ : జిల్లా వ్యాప్తంగా మద్యం షాపులకు సంబంధించి దరఖాస్తు గడువు పెంచుతున్నట్లు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ అధికారి మధుసూధన్ తెలిపారు. శనివారం రాయచోటిలో మద్యం షాపుల యజయానులతో ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 17 మద్యం షాపుల రెన్యూవల్ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని తెలిపారు. వీటిలో మున్సిపాల్టీకి సంబంధించి ఒక్కో షాపుకోసం రూ.71,50,000 లైసెన్స్ ఫీజుతో పాటు రూ.7.5లక్షలు పర్మిట్ రూం లైసెన్స్ ఫీజు చెల్లించాలని, రూరల్ పరిధిలోని షాపులకు 60.5లక్షలు లైసెన్స్ ఫీజులు, పర్మిట్ రూం లైసెన్స్ కోసం రూ.5లక్షలు చెల్లించాలని తెలిపారు. వివరాలకు 7981216391 నంబర్‌లో సంప్రదించాలనికోరారు. ఈ కార్యక్రమంలో రాయచోటి ఎకై ్సజ్ శాఖ అధికారి గరుప్రసాద్ పాల్గొన్నారు.


